సినీ నటి హేమ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, మీటూ వంటి వ్యవహారాలపై స్పందించింది హేమ. కెరీర్ కోసం ఏదో చేసుకోవడం తప్పని అనుకోవడం లేదని చెప్పిన హేమ, అవసరాలు తీర్చుకోవడం కోసం ఆ పని చేసి మీటూ అనడం కరెక్ట్ 
కాదని అన్నారు.

కెరీర్ కోసం ఏదో చేసి, వాడు నన్ను గోకాడు.. ఇలా అన్నాడు అంటూ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడడం ఏంటని ప్రశ్నించింది. మన అవసరాలు తీరడం కోసం తప్పు చేసి ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బయట  ఎన్నో తప్పులు, దారుణాలు జరుగుతున్నాయని, వాటిని ఇండస్ట్రీకి 
చెందిన దర్శకులు, కుర్రాళ్లు ఎవరైనా చేస్తున్నారా..? అంటూ ప్రశ్నించింది. 

నటి శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ.. ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు పెళ్లిళ్ళు కావడం లేదని, ఆ మహాతల్లి(శ్రీరెడ్డి) పెట్టిన ఫిటింగ్ కి ఇండస్ట్రీ అమ్మాయిలకు అద్దెకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని వాపోయింది. ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి పని చేసే ప్రతి చోటా కొన్ని ఇబ్బందులు ఉంటాయని, కానీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారని చెప్పిన హేమ.. ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్లు ఉంటారని, ఎవరూ రేప్ లు చేయరని.. కొందరు తమ కెరీర్ కోసం రాజీ  పడుతుంటారని చెప్పింది.

ఎవరైనా వచ్చి ఏదైనా తప్పుగా అడిగినప్పుడు ఇష్టం లేదని చెప్పే ఆప్షన్ అమ్మాయిలకు ఉంటుందని, అవతలి వాళ్లు బలవంతంగా ఏం చేయలేరని స్పష్టం చేసింది. 

నా నడుము పట్టుకొని గిల్లాడు.. నటి హేమ కామెంట్స్!

త్రివిక్రమ్ పేరు చెప్తే మండిపడుతున్న నటి హేమ!