సినీ నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించింది. రీసెంట్ గా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ పై కామెంట్స్ చేయడంతో పాటు, పూరిజగన్నాథ్-ఛార్మీ రిలేషన్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది హేమ.

ఈ క్రమంలో ఆమెకి మీటూ సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురుకాలేదని చెప్పిన హేమ.. పబ్లిక్ లో ఒక వ్యక్తి ఆమె నడుము పట్టుకొని గిల్లిన విషయాన్ని వెల్లడించింది.

శ్రీహరి మరణించిన సమయంలో ఆయనను చూడడానికి వందలమంది జనం గూమిగూడారట. అక్కడ ఇరుకుగా ఉన్నప్పుడు.. ఎవరో ఒకవ్యక్తి హేమ నడుము పట్టుకొని గిల్లాడట. అయితే వెంటనే హేమ అతడిని  పట్టుకొని తుక్కుతుక్కుగా కొట్టిన వైనాన్ని వెల్లడించింది. ఇటువంటి చేదు అనుభవాలు చాలా మందికి ఎదురవుతుంటాయని చెప్పుకొచ్చింది. 
 

త్రివిక్రమ్ పేరు చెప్తే మండిపడుతున్న నటి హేమ!