సినీ నటి హేమ.. ప్రేక్షకులకు సుపరిచితురాలే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంటూ మరోపక్క 'మా' అసోసియేషన్ లో మెంబర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది.

నటిగా తానేంటో ఇండస్ట్రీలో నిరూపించుకున్నానని, దర్శకులు హీరోలను చూసి వంద టికెట్లు తెగుతుంటే తనను చూసి పదిహేను టికెట్లు తెగుతున్నాయని హేమ చాలా నమ్మకంగా చెప్పారు. 'వినయ విధేయ రామ' సినిమాతో మరోసారి తన ప్రతిభని నిరూపించుకున్నానని వెల్లడించారు.

ఇక త్రివిక్రమ్ సినిమాలో వరుసగా నటించే హేమ ఆయన సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించగా..? ''అసలు అతను ఎవరు నా రెమ్యునరేషన్ డిసైడ్ చేయడానికి..?'' అంటూ మండిపడింది. త్రివిక్రమ్ ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమని తీసుకున్నప్పుడు అతడే తన రెమ్యునరేషన్ డిసైడ్ చేయడం హేమకి నచ్చలేదట.

నిర్మాతలు ఉన్నప్పుడు వారే అన్నీ మాట్లాడతారని.. నచ్చితే ఆర్టిస్ట్ ని తీసుకుంటారని, డైరెక్టర్ కి ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ తో సంబంధం ఏంటని త్రివిక్రమ్ పై ఫైర్ అయింది. ఆరోజు నుండి త్రివిక్రమ్ పేరు కనిపిస్తే పక్కకు తప్పుకొని వెళ్లిపోతున్నానని వెల్లడించింది. తన ఈగో బాగా హర్ట్ అయిందని కడుపు మండేలా చేశాడని సంచలన కామెంట్స్ చేసింది.