ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో భారీ బడ్జెట్ తో వస్తోన్న మొదటి చిత్రం 2 పాయింట్ 0. దాదాపు 400కోట్లతో నిర్మపించబడిన ఈ సినిమా మొత్తానికి రిలీజ్ కు సిద్ధమైంది. నవంబర్ 29న సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇండియాలో అత్యధిక థియేటర్స్ లో రిలీజవుతున్న మొదటి సినిమా అని చెప్పవచ్చు. 

ఇకపోతే దర్శకుడు శంకర్ ప్రమోషన్ డోస్ పెంచేస్తున్నాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపు 12గంటలకు సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇదివరకు వచ్చిన టీజర్ కొంత నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 

అయితే ఇప్పుడు ట్రైలర్ మాత్రం అలాంటి టాక్ కు అవకాశమివ్వదని సమాచారం. ఎందుకంటే శంకర్ సినిమాలో ఉండే హైలెట్ పాయింట్స్ ను చూపించి చూపించనట్టుగా కట్ చేయించాడట. ఎవ్వరు ఊహించని విధంగా విజువల్ సీన్స్ ను ట్రైలర్ లో చూపించనున్నారని తెలుస్తోంది. మరి అంచనాలు రేపుతున్న ట్రైలర్ సినిమాకు ఎంతవరకు క్రేజ్ ను అందిస్తుందో చూడాలి.  

ఇవి కూడా చదవండి.. 

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు