Asianet News TeluguAsianet News Telugu

టెన్నిస్ స్టార్ తో.. గోవాలో హాట్ బ్యూటీ కిమ్ శర్మ.. ఫోటోలు వైరల్

ఆమె ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా... వారిద్దరూ కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. 

Viral Kim Sharma And Leander Paes' Loved Up Pics From Goa Vacation
Author
Hyderabad, First Published Jul 15, 2021, 7:30 AM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ తెలియని వారు ఉండరేమో. ఆమె తెలుగులోనూ ఖడ్గం, మగ ధీర సినిమాల్లో కనిపించి అలరించారు. ఈ రెండు సినిమాల్లో ఆమె నటించిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సంగతి పక్కన పెడితే... ఈ హాట్ బ్యూటీ లవ్ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆమె ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా... వారిద్దరూ కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. 

 

 ఆ ఇద్ద‌రూ తాజాగా దిగిన ఫోటోల‌ను ఓ గోవా రెస్టారెంట్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కిమ్ శ‌ర్మ‌ను వెనుక నుంచి హ‌గ్ చేసిన ఓ ఫోటోను ఆ హోట‌ల్ త‌న అకౌంట్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటో వైర‌ల్ కావ‌డంతో డేటింగ్ రూమ‌ర్స్ కూడా జోరందుకున్నాయి. గోవా వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న ఆ జంట ఫోటోల‌ను చూసి లియాండ‌ర్‌, కిమ్ అభిమానులు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. పొసుద బీచ్ ఆ ఫోటోల‌ను అప్‌లోడ్ చేసింది. ఇద్ద‌రు క‌లిసి భోజ‌నం చేసేముందు కూడా దిగిన ఓ ఫోటోను నిన్న ఆ రెస్టారెంట్ పోస్టు చేసింది.

వీరిద్దరూ కలిసి కెమేరాకు చిక్కడం ఇదేమీ తొలిసారి కాదు. అయితే.. ఇంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో.. వీరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా తమ బంధం గురించి ఈ బ్యూటీ నోరు విప్పుతుందో లేదో చూడాలి. ఇలా ఉంటే... లియాండ‌ర్ గ‌తంలో మోడ‌ల్ రియా పిళ్లైను పెళ్లి చేసుకున్నారు. ఇక కిమ్ శ‌ర్మ కూడా గ‌తంలో హీరో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణేతో డేటింగ్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios