Asianet News TeluguAsianet News Telugu

హీరో రాజశేఖర్ కి మరో షాక్.. డ్రైవింగ్ చేస్తే జైలుకే!

గురుడవేగ సినిమాతో  సెట్టయ్యడానికి అనుకున్న సీనియర్ హీరో ఇప్పుడు కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆరు నెలల పాటు రాజశేఖర్ లైసెన్స్ ని రద్దు చేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు.

traffic police cancel the driving license of actor Rajasekhar.
Author
Hyderabad, First Published Dec 18, 2019, 8:24 AM IST

హీరో రాజశేఖర్ కి మరో షాక్ తగిలింది. గురుడవేగ సినిమాతో  సెట్టయ్యడానికి అనుకున్న సీనియర్ హీరో ఇప్పుడు కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆరు నెలల పాటు రాజశేఖర్ లైసెన్స్ ని రద్దు చేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు.  గతంలో పలు మార్లు రాజశేఖర్ పలుమార్లు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురయ్యారు.

నవంబర్13న రాజశేఖర్ కారు  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతివేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్దారించారు. అదే విధంగా చలానాలు కూడా గట్టిగా ఉండడంతో ఫైనల్ గా రూల్స్ ప్రకారం అధికారులు రాజశేఖర్ లైసెన్స్ ని ఆరు నెలల పాటు రద్దు చేశారు.  లైసెన్స్ రద్దు చేసినప్పుడు డ్రైవింగ్ చేస్తే చట్టప్రకారం ఆ వ్యక్తిని జైలుకి తరలిస్తారు.

అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

రాజశేఖర్ ఆరు నెలల పాటు డ్రైవింగ్ చేయకూడదు.  రాజ‌శేఖ‌ర్ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్నిరోజుల క్రితం ఆర్టీఏకి లేఖ కూడా రాశారు. ట్రాఫిక్ చ‌ట్టాల‌ని రెండు మూడు సార్లు ఉల్లంఘించిన నేప‌థ్యంలో పోలీసులు తీసుకున్న ఈ నిర్ణ‌యం మంచిదేన‌ని జ‌నాలు చెబుతున్నారు. 2017 అక్టోబ‌ర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వలననే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. త‌ల్లి చనిపోయింద‌నే డిప్రెష‌న్‌లో నిద్ర‌మాత్ర‌లు వేసుకోవ‌డం వ‌ల‌న ఆ మ‌త్తులో కారు యాక్సిడెంట్ చేశాడ‌ని అన్నారు. గ‌రుడవేగ చిత్ర రిలీజ్‌కి కొద్ది రోజుల ముందే ఈ యాక్సిడెంట్ జ‌రిగింది.  ఇక రీసెంట్‌గా శంషాబాద్ పెద్ద గోల్కొండ వ‌ద్ద ఓఆర్ఆర్‌పై న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారు మూడు ప‌ల్టీలు కొట్టింది.

స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో ఆయ‌న‌ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. రాజ‌శేఖ‌ర్ కారు డివైడ‌ర్‌ని ఢీకొట్టి అవ‌తలి వైపుకి ప‌ల్టీలు కొట్టుకుంటూ వెళ్ల‌గా, ఆ స‌మ‌యంలో ఎలాంటి వాహ‌నాలు లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదమే త‌ప్పింది. దీనిని చాలా సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు రాజ‌శేఖ‌ర్ డ్రైవింగ్ లైసెన్స్ ని ఆరు నెలల పాటు ర‌ద్దు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios