బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్, సినీ నటి రియా చక్రవర్తి కస్టడీని ముంబై కోర్టు అక్టోబర్ 6 వరకు పొడిగించింది. మరో 14 రోజుల బైకుల్లా జైలులోనే ఉండనుంది రియా.

రేపు రియా చక్రవర్తి ఆమె సోదరుడి బెయిల్ పిటిషన్‌పై విచార జరగనుంది. డ్రగ్స్ కేసులో ఈ నెల 6న రియాను అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. రియా డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు ఎన్సీబీ గుర్తించింది.

సుశాంత్‌కు రియానే డ్రగ్స్ ఇచ్చినట్లు తేలింది.. బాలీవుడ్‌లో పలువురు హీరోయిన్లకు రియా డ్రగ్స్‌ను విక్రయించినట్లు గుర్తించిన ఎన్సీబీ 25 మందితో జాబితాను సిద్ధం చేసింది. ఇందులో సారా అలీ ఖాన్, దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్ సహా పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

Also Read:దీపికా మేనేజర్‌ కరిష్మాకి ఎన్‌సీబీ సమన్లు.. నెక్ట్స్ దీపికే?

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. బీ టౌన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ గలీజు దందా నడుస్తోందని ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి చెప్పిన వివరాలను బట్టి ఎన్సీబీ విచారణ ముమ్మరం చేసింది.

తాజాగా దీపికా పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఆమె కూడా డ్రగ్స్  తీసుకున్నట్లు నేషనల్ మీడియా కథనాలు ప్రపచురించడం సంచలనం సృష్టిస్తోంది.

జయా సాహా ఇచ్చిన సమాచారాన్ని బట్టి 2017 అక్టోబర్ 28న దీపికా ఆమె మేనేజర్ కరిష్మా మధ్య ఈ చాటింగ్ వ్యవహారం నడిచింది. ఈ ఛాటింగ్ వ్యవహారం మొత్తాన్ని ఎన్సీబీ డికోడ్ చేసింది.