Asianet News TeluguAsianet News Telugu

టీ20 క్రికెట్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

Sunrisers Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రికార్డ్ బ్రేకింగ్ సీజన్. ఈ జ‌ట్టు ఓపెనింగ్ ద్వయం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తమ అద్భుత‌మైన ఆట‌తో విశ్వ‌రూపం  చూపిస్తున్నారు. త‌మ విధ్వంసంతో హైద‌రాబాద్ టీమ్ చరిత్ర సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
 

Sunrisers Hyderabad break Chennai's record and break t20 cricket's all-time record, Tata IPL 2024 SRH vs LSG RMA RMA
Author
First Published May 9, 2024, 9:23 AM IST

Tata IPL 2024 SRH : ఐపీఎల్ 2024 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయ‌ర్లు దుమ్మురేప‌డంతో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్ప‌టికే అనేక కొత్త రికార్డులు సృష్టించ‌డంతో పాటు పాత రికార్డులు కూడా బ‌ద్ద‌ల‌వుతున్నాయి. ఐపీఎల్ 2024 సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రికార్డ్ బ్రేకింగ్ సీజన్ అని చెప్పాలి. ఎందుకుంటే ఈ జ‌ట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తమ అద్భుత‌మైన ఆట‌తో విశ్వ‌రూపం  చూపిస్తున్నారు. త‌మ విధ్వంసంతో హైద‌రాబాద్ టీమ్ చరిత్ర సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సునామీ సృష్టించారు. కేవ‌లం 10 ఓవ‌ర్లు పూర్తి కాకముందే 166 ప‌రుగుల టార్గెట్ ను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించారు.

166 పరుగుల ఛేదనలో హైదరాబాద్ టీమ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన సమరంలో కేవలం 9.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఇది టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన టార్గెట్ ఛేజింగ్ గా రికార్డు ఘనత సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జంట సునామీ ఇన్నింగ్స్ తో ల‌క్నో బౌలింగ్ ను చెడుగుడు ఆడుకుంది. ఏకంగా 14 సిక్స‌ర్లు, 16 ఫోర్లతో గ్రౌండ్ లో బౌండ‌రీల వ‌ర్షం కురిపించారు. ఈ క్ర‌మంలోనే చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టారు. ఒకే ఐపీఎల్ సీజ‌న్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును బ‌ద్ద‌లు కోట్టారు.

కేఎల్ రాహుల్‌ను గ్రౌండ్‌లోనే తిట్టేసిన‌ లక్నో యజమాని.. స్టార్ ప్లేయ‌ర్ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించేది ఇలాగేనా.. వీడియో

ఐపీఎల్ 2024 లో ఇప్ప‌టివ‌ర‌కు స‌న్ రైజ‌ర్స్ హైదారాబాద్ 146 సిక్సర్లతో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన టీమ్ గా ఉంది. అంత‌కుముందు 2018 ఐపీఎల్ ఎడిషన్‌లో 145 సిక్స‌ర్ల చెన్నై సూప‌ర్ కింగ్స్ రికార్డును హైద‌రాబాద్ టీమ్ బ‌ద్ద‌లు కొట్ట‌లింది. ఇక టీ20 క్రికెట్ లో కౌంటీ జట్టు సర్రే గతేడాది 144 సిక్సర్లు బాది ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని మొదటి ఎనిమిది జట్లలో సర్రే మాత్రమే ఐపీఎల్ జ‌ట్టు కాకుండా ఉంది.

మాట‌లు రావ‌డం లేదు.. స‌న్ రైజ‌ర్స్ విధ్వంసంతో బిత్త‌ర‌పోయిన కేఎల్ రాహుల్

ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్ల జట్ల రికార్డులు
జట్టు సిక్సర్లు సంవత్సరం
సన్‌రైజర్స్ హైదరాబాద్ 146* ఐపీఎల్ 2024
చెన్నై సూపర్ కింగ్స్ 145 ఐపీఎల్ 2018
కోల్‌కతా నైట్ రైడర్స్ 143 ఐపీఎల్ 2019
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 142 ఐపీఎల్ 2016
ముంబై ఇండియన్స్ 140 ఐపీఎల్ 2023

 

అంపైర్ తో ఫైట్.. సంజూ శాంసన్‌కు షాకిచ్చిన బీసీసీఐ 

Follow Us:
Download App:
  • android
  • ios