Sanjiv Goenka - KL Rahul : సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తో టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సీరియస్ గా వ్యవహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tata IPL 2024 : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనతో లక్నోను చిత్తుచేసింది. ప్లేఆఫ్ రేసులో కనిపించిన లక్నో జట్టు వరుసగా రెండు పరాజయాలతో అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 98 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ 62 బంతులు మిగిలి ఉండగానే 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ఇలా జట్టుగా ఘోరంగా ఓటమిపాలు కావడంపై లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తన నిరాశను వ్యక్తం చేయడం, అతని సీరియస్ అవుతూ గ్రౌండ్ లోనే తిట్టడం.. సంబంధిత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ తో గోయెంకా మాట్లాడుతూ సీరియస్ గా మాట్లాడుతున్నారు. రాహుల్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న వినిపించుకోకుండా తిడుతూ.. కోపంగా మాట్లాడుతున్నట్టు సంబంధిత వీడియో దృశ్యాల్లో కపినిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడికి కోచ్ జస్టిన్ లాంగర్ రావడంతో అక్కడి నుంచి కేఎల్ రాహుల్ నిరాశగా వెళ్లిపోయాడు.
మాటలు రావడం లేదు.. సన్ రైజర్స్ విధ్వంసంతో బిత్తరపోయిన కేఎల్ రాహుల్
ఇప్పుడు ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా తీరుపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టుకు ఆడిన స్టార్ ప్లేయర్ తో వ్యవహించే తీరు ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఈ తరహా సంభాషనలు, అదీ కాకుండా అన్ని కెమెరాలు ఫోకస్ అయిన క్రమంలో ఒక స్టార్ ప్లేయర్ ను ఇలా తిట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇతర ఫ్రాంఛైజీలు ప్లేయర్ల పట్ల ఎలా నడుచుకుంటున్నాయి లక్నో యజమాని తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఓటమి నిరాశలో ఉన్న సమయంలో ఆటగాళ్లతో మాట్లాడే తీరు ఇది కాదనీ, ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇలా గ్రౌండ్ లో కాకుండా డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడాలని సూచిస్తున్నారు. క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
