పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాని, విశాల్, ;లారెన్స్ లాంటి ప్రముఖులపై శ్రీరెడ్డి ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయింది. గత ఏడాది కాస్టింగ్ కౌచ్ వ్యవహారం టాలీవుడ్ ని కుదిపేసినప్పుడు శ్రీరెడ్డి మీడియాలో, సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించింది.  

ఇప్పటికి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన నోటికి పని చెబుతూనే ఉంది. తరచుగా నటులపై విరుచుకుపడుతోంది. ఈసారి శ్రీరెడ్డి రాజకీయ కుటుంబానికి చెందిన తమిళ హీరోపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి ఈసారి టార్గెట్ చేసింది ఎవరినో కాదు.. తమిళనాడు మాజీ సీఎం మనవడు ఉదయనిధి స్టాలిన్ ని. 

ఎంతో మందిని తొక్కేశారు.. నా జోలికి రావద్దు చిరంజీవి గారు.. శ్రీరెడ్డి కామెంట్స్!

తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి పోస్ట్ పెడుతూ..హాయ్ ఉదయనిధి స్టాలిన్ సర్.. మూడేళ్ళ క్రితం మనం హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో కలిశాం.. గుర్తుందా.. ఆ రోజురాత్రి మనమిద్దరం లైగికంగా కలిశాం. హీరో విశాల్ మిమ్మల్ని నాకు పరిచయం చేశాడు. ఆరోజు రాత్రి మనమిద్దరం చాలా చేశాం. 

నాకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని మీరు నాకు మాట ఇచ్చారు. నేను నమ్మా. కానీ ఇంతవరకు నాకు సినిమాలో ఛాన్స్ రాలేదు. మీరు నన్ను మరచిపోయినట్లు ఉన్నారు.. కానీ నేను మాత్రం మరచిపోలేదు.. మీరు చాలా గ్రేట్ సర్ అంటూ శ్రీరెడ్డి ఉదయనిధి స్టాలిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

''పూనమ్ గోడ మీద పిల్లి'' నటి శ్రీరెడ్డి ఫైర్!

ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ డీఎంకే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఇదు కార్తివేలన్, మానితన్ లాంటి వినోదాత్మక చిత్రాల్లో నటించాడు.