శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవిని అగౌరవ పరిచేలా శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ శ్రీరెడ్డి ఉన్నట్లుండి చిరంజీవిని టార్గెట్ చేయడానికి కారణం ఉంది. 

ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ కి తన చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఫినాలేలో చిరంజీవి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరి గురించి మాట్లాడారు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ తమన్నాని చిరు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలో చిరు పరోక్షంగా శ్రీరెడ్డిపై సెటైర్లు వేశారు. 

తమన్నా డైనమిక్ గర్ల్.. తేడాలొస్తే ఎవరినైనా సరే చీల్చి చండాదే వ్యక్తి. ప్రేమిస్తే మనసు ఇచ్చేస్తావ్. తప్పు చేసింది నీ స్నేహితులు అయినా సరే.. ధైర్యంగా వారిని ఎదిరించగలవు. ఆ ధైర్యం నీలో ఉంది అని చిరంజీవి తమన్నాని ప్రశంసించారు. 

 

ఈ వ్యాఖ్యలు తనని ఉద్దేశించినవిగా శ్రీరెడ్డి భావించింది. తన ఫేస్ బుక్ పేజీలో చిరంజీవిపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడింది.  'సారీ చిరంజీవి గారు.. మీరు నా కామెంట్స్ ని కూడా తీసుకోండి. కాకపోతే నేను కొంచెం సాఫ్ట్ గా మాట్లాడతా. 

మీకు పేరు ఉంది కాబట్టి మేమంతా వెధవలమా.. వయసు కాదు జ్ఞానం ఉండాలి. నా జోలికి వస్తే పంబపగిలి రంబ బయటకు వస్తది.. ఎంతోమంది ప్రతిభగల నటుల్ని తొక్కేశారు. 13మంది హీరోలని కన్నారు. నన్ను కూడా తొక్కాలని అనుకుంటున్నారా.. వినాశకాలే విపరీత బుద్ధి. నన్ను కెలకొద్దు అంటూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడింది. 

గతంలో శ్రీరెడ్డి టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో హాట్ టాపిక్ గా నిలిచింది. తనకు మద్దతు తెలపలేదని పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీనితో మెగా అభిమానులు శ్రీరెడ్డిని ట్రోల్ చేశారు. అప్పటి నుంచి శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తోంది. ఎక్కువగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు సంధిస్తోంది.