నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో చేసిన ఆరోపణల గురించి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల పరంగా కూడా ఈమె పలు కామెంట్స్ చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డితో ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

అయినప్పటికీ ఆమె మాత్రం తగ్గకుండా  సందర్భం దొరుకుతున్న ప్రతీసారి పవన్ ని టార్గెట్ చేస్తూనే ఉంది. మరోపక్క హీరోయిన్ పూనమ్ కి కూడా పవన్ అంటే పడదు. గతంలో పవన్ పై చాలా విమర్శలు చేసింది. పవన్ వ్యక్తిగత విషయాలపై కూడా పూనమ్ కామెంట్స్ చేయడంతో జనసైనికులు ఆమెపై విరుచుకుపడ్డారు.

రకుల్ ప్రీత్ సింగ్ స్పైసీ లుక్స్.. వైరల్ అవుతున్న ఫొటోస్!

తాజాగా మరోసారి పూనమ్.. పవన్ గురించి పరోక్షంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. 'ఓ అబద్దా కోరు రాజకీయనాయుడు కాగలడు కానీ.. లీడర్ మాత్రం కాలేడు' అంటూ ట్వీట్ చేసింది పూనమ్. ఈ ట్వీట్ ఆమె పవన్ గురించే పెట్టిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. 

పూనమ్ ఇలా పరోక్షంగా పవన్ ని ఉద్దేశించి ట్వీట్ చేయడం శ్రీరెడ్డికి నచ్చలేదు. అందుకే పూనమ్ ని పవన్ గురించి ఓపెన్ గా మాట్లాడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ''ఇలా గోడ మీద పిల్లి ట్వీట్లు పెట్టకు పూనమ్. ధైర్యముంటే డైరక్ట్ గా మాట్లాడు. నీ వల్లే అవుతుంది వాడి పెళ్లి. ఒక్క చిన్న కంప్లయింట్ ఇవ్వు. మిగతాది మా వాళ్లు చూసుకుంటారు'' అంటూ నేరుగా పూనమ్ ని ఉద్దేశిస్తూ విమర్శలు చేసింది.

పవన్ ని నేరుగా విమర్శించడానికి శ్రీరెడ్డి ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. అతడి పేరు ప్రస్తావిస్తూ నేరుగా ఎన్నో విమర్శలు చేసింది. దానికి తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడం తగ్గించింది శ్రీరెడ్డి.