తెలుగు లోనే స్టార్ హీరోయిన్స్ లలో ఒకరిగా వెలుగుతోంది  పూజా హెగ్డే. వరస పెట్టి పెద్ద సినిమాలు చేస్తున్న ఆమె అందాల ప్రదర్శనలో ఎప్పుడూ మొహమాట పడదు. సినిమాల్లోనే కాదు ...అప్పుడప్పుడూ మూడ్ వచ్చినప్పుడు ఇదిగో ఇలా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ హల్ చల్ చేస్తూంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్ లో హాట్ ప్రాపర్టీగా మారింది. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

బాల్కనీలోని సోఫాలో కూర్చుని  మాంచి రోమాంటిక్ ఫోజు ఇస్తు దిగిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఓ ప్ర్కక భుజంపై నిలవలేక జారీపోతున్న ఓణీతో విరహ వేదన ప్రతిఫలించే లుక్స్ తో ఆమె కుర్రాళ్ల గుండెలను దోచేస్తోంది. పూజా హెగ్డే ని ఇలా చూసిన వాళ్లెవరూ మొహం తిప్పుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లోనూ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్న ఆమె ఇలాంటి ఫొటోలతో క్రేజ్ క్రియేట్ చేయాలని చూస్తోంది.

(Also Read) బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆకాశంలోకి.. ప్లాప్ తో పాతాళంలోకి!

ఇక ఈ ఫొటోలో గమనిస్తే మరో విశేషం ఉంది. ఆమె కూర్చున్న  సోఫా ముందర టేబుల్ పై ఒక బీర్ బాటిల్  కనిపిస్తోంది. దీన్ని చూసి...అమ్మడు  బీరు కొట్టి ఇలా విరహవేదన అనుభవిస్తోందనే  కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాతో హిందీ తెరపై మెరవబోతున్నారీ బ్యూటీ.

అలాగే అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల...వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇక ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కుతోంది. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకుడు. 1960లలో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా కథాంశం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో పూజా స్కూల్‌ టీచర్‌ పాత్రలో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది.