Asianet News TeluguAsianet News Telugu

లీక్: మహేష్, రాజమౌళి కాంబో జేమ్స్ బాండ్ కాదట,మరి?

తాను మహేష్ బాబుతో కనక సినిమా చేస్తే జేమ్స్ బాండ్ తరహా మూవీ చేస్తానంటూ రాజమౌళి సిగ్నల్స్  ఇచ్చిన నేపథ్యంలో అలాంటి సినిమా అయితే ఎలా ఉంటుందనే డిస్కషన్లలో మునిగిపోయారు ఫ్యాన్స్. అయితే అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి చేయబోయేది జేమ్స్ బాండ్ తరహా చిత్రం మాత్రం కాదట. ఆయన వరస పెట్టి చేస్తున్నటువంటి పిక్షన్ తో కూడిన పీరియడ్ మూవీలాంటిదే ఇదీను అంటున్నారు.

Mahesh Babu not to play a James Bond in rajamouli movie?
Author
Hyderabad, First Published Apr 27, 2020, 4:57 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేస్తే బాగుంటుంనేది అందరి మాట.ఈ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ కళ్లు కాచేలా  ఎదురు చూస్తున్నారు. త్వరలో అనే ఒక్క పదంతోనే  ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఈ కాంబినేషన్ ఉండదులే అని భావిస్తున్న  టైమ్ లో రాజమౌళి సడెన్ గా... సూపర్ స్టార్ అభిమానులకు పండగ చేసుకునే కబురు చెప్పాడు.‘ఆర్ఆర్ఆర్’ అయ్యాక తన తర్వాతి సినిమా మహేష్ బాబుతోనే అని తేల్చేశారు. ఇక అప్పట్నుంచి వీళ్ల కలయికలో ఎలాంటి సినిమా వస్తుందనే చర్చ మొదలైపోయింది.
 
తాను మహేష్ బాబుతో కనక సినిమా చేస్తే జేమ్స్ బాండ్ తరహా మూవీ చేస్తానంటూ రాజమౌళి సిగ్నల్స్  ఇచ్చిన నేపథ్యంలో అలాంటి సినిమా అయితే ఎలా ఉంటుందనే డిస్కషన్లలో మునిగిపోయారు ఫ్యాన్స్. అయితే అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి చేయబోయేది జేమ్స్ బాండ్ తరహా చిత్రం మాత్రం కాదట. ఆయన వరస పెట్టి చేస్తున్నటువంటి పిక్షన్ తో కూడిన పీరియడ్ మూవీలాంటిదే ఇదీను అంటున్నారు. అయితే ఇందులో రాజమౌళి ..మహేష్ ని ఆకాలం నాటి ఓ గూఢచారిగా చూపెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. ఇంత టెక్నాలిజీ లేని రోజుల్లో ఓ గూఢచారి ప్రయాణం...దేశాన్ని దడదడలాడించే ఓ కేసుని డీల్ చేసే విధానం ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే అది ఒకింత కష్టమైనదని,స్క్రిప్టు పూర్తి అయితే ఏమీ డిసైడ్ చెయ్యలేరని అంటున్నారు. 
 
ఈ సినిమా గురించి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు రాజమౌళి. మహేష్‌తో తన సినిమా గురించి ఇప్పుడే ఊహాగానాలు అవసరం లేదని.. ఇంకా తాము ఏమీ అనుకోలేదని తేల్చేశాడు. మహేష్‌తో జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది.. నిజమేనా అని అడిగితే.. ‘‘ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మహేష్ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌తో పాటు నా అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందా సినిమా.

 ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే తదుపరి సినిమా మొదలుపెట్టాలి. మహేష్‌తో కూడా ఇంకా కథ గురించి చర్చించలేదు’’ అని రాజమౌళి స్పష్టం చేశాడు. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ బేనర్లో రాజమౌళి ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios