బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో కత్రినా ఆమెని ఓవర్ టేక్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో కత్రినా ఆమెని ఓవర్ టేక్ చేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, అమీర్ లతో పాటు హృతిక్ రోషన్ తో కూడా రొమాన్స్ చేసింది.
ఇక ఆమె లవ్ ఎఫైర్స్ కైతే లెక్కే లేదు. ప్రస్తుతం కత్రినా యంగ్ సెన్సేషన్ ఉరి హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం కత్రినా లాక్ డౌన్ సందర్భంగా పలు వీడియోల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవల కత్రినా కిచెన్ లో అంట్లు తోముతున్న వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
సాక్షి మాలిక్ హాట్ ఫోటోస్.. ఈ పిల్ల సెక్సీ లుక్స్ అదుర్స్
తాజాగా వంట చేస్తున్న వీడియో పంచుకుంది. కత్రినా హుషారుగా, చిరునవ్వుతో కిచెన్ లో ఎదో తురుముతోంది. తాను చేస్తున్న వంటకాన్ని కత్రినా చూపించి చూపించకుండా దాచేసింది. దీనితో కత్రినా చేస్తున్న వంట ఏంటి అని అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అంతకు ముందు కత్రినా తన చెల్లి ఇసాతో కలసి కిచెన్ లో ఉన్న వీడియో కూడా షేర్ చేసింది.
కత్రినా చివరగా భారత్ చిత్రంతో సల్మాన్ ఖాన్ కు జోడిగా నటించింది. తెలుగులో కత్రినా మల్లీశ్వరి, అల్లరి పిడుగు లాంటి చిత్రాల్లో మెరిసింది.
