హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ యూ టర్న్ తీసుకొన్నారు. టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవిని తాను సీఎంను ఏనాడూ అడగలేదన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.నిజామాబాద్ జిల్లా అభివృద్దికి ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు.అవసరమైతే మళ్ళీ మళ్లీ కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.

మర్యాదపూర్వకంగానే తాను షకీల్‌ను కలిసినట్టుగా ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో ఓ పధకం ప్రారంభోత్సవం కోసం  నిజామాబాద్ ఎంపీ  అరవింద్ ను ఆహ్వానించినట్టుగా ఆయన తెలిపారు.

టీఆర్ఎస్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు. పదవులు కావాలని అడగడం తప్పు లేదన్నారు.  సామాన్య కార్యకర్తను కూడ ఎంపీగా ఎన్నిక చేసిన ఘనత టీఆర్ఎస్‌దేనని ఆయన చెప్పారు.

కేసీఆర్ తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. తాను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మంత్రి పదవి ఇవ్వాలని తాను కేసీఆర్‌ను అడగలేదన్నారు. భవిష్యత్తులో తనకు అవకాశమిస్తారని తాను ఆశిస్తున్నట్టుగా చెప్పారు.

టీఆర్ఎస్ అందరిది... ఇది ఏ ఒక్కరిది కాదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ లోని ప్రతి ఒక్క కార్యకర్త కూడ టీఆర్ఎస్‌కు ఓనర్లని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అందరిదని ఆయన చెప్పారు.

అవకాశం వచ్చినప్పుడు తనకు పదవిని సీఎం కేసీఆర్ అవకాశాలను కల్పిస్తారని షకీల్ వ్యక్తం చేస్తున్నారు.  పార్టీని వీడే అవకాశం లేదన్నారు.


సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ లో గుర్తింపు లేదు, రాజీనామాకు సిద్దం: షకీల్ సంచలనం

బిజెపి ఎంపీ ఆరవింద్ తో టీఆర్ఎస్ ఎమ్మల్యే షకీల్ భేటీ: గులాబీ పార్టీలో కలకలం

టీఆర్ఎస్ లో అసమ్మతి: బిజెపి భయంతో రంగంలోకి కేటీఆర్

పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ