హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ అనంతరం తలెత్తిన అసంతృప్తిని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్వయంగా రంగంలోకి దిగారు. వారితో ఆయన ప్రకటనలు ఇప్పించారు. అసంతృప్తి నేతలకు ఫోన్లు చేసి తొందరపడవద్దని చెప్పారు. వారిని కేటీఆర్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. 

మంత్రివర్గ విస్తరణ అనంతరం కొంత మంది బహిరంగంగానే విమర్శలు చేశారు. కేసీఆర్ మాట తప్పారని మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి విమర్శించారు. జోగు రామన్న అలక బూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ డిప్యూటీ సిఎం రాజయ్య కూడా తన అసమ్మతి గళం వినిపించారు. మైనంపల్లి హనుమంతరావు బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరయ్యారు. 

పదవులు దక్కని ఎమ్మెల్యేల సేవలను సందర్భానికి అనుగుణంగా వాడుకుంటామని, ఎవరినీ విస్మరించబోమని ఆయన హామీ ఇచ్చారు. దాంతో ఒక్కరొక్కరే ప్రకటనలు ఇస్తూ వెళ్లారు. కేసీఆర్ పై విశ్వాసాన్ని ప్రకటిస్తూ వాళ్లు ప్రకటనలు చేశారు. 

ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బిజెపి నాయకులు ప్రకటించడమే కాకుండా అసంతృప్త టీఆర్ఎస్ నేతలను, ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బిజెపి కార్యాచరణ నేపథ్యంలో కేటీఆర్ అప్రమత్తమై నేతలతో మాట్లాడుతున్నారు. 

ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడం అనర్హతకు గురైతే తిరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని కూడా బిజెపి నేతలు హామీ ఇస్తున్నారు. అనర్హత వేటుకు భయపడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ