నిజామాబాద్: బిజెపి పార్లమెంటు సభ్యుడు ధర్మపురి బోధన్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు షకీల్ భేటీ అయ్యారు. ఈ సంఘటన టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. దీంతో షకీల్ పార్టీ మార్పుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

మంత్రి పదవి రాకపోవడంతో షకీల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇంకా ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారనే విషయంపై ధర్మపురి అరవింద్ కు, షకీల్ కు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

మాజీ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితతో ఆయన సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి కల్వకుంట్ల ఓటమి పాలయ్యారు. ఆమెపై ధర్మపురి అరవింద్ బిజెపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 

టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు బిజెపిలో చేరడానికి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ తో షకీల్ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ లో అసమ్మతి: బిజెపి భయంతో రంగంలోకి కేటీఆర్

పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ