నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ అరవింద్‌తో అన్ని విషయాలను చర్చించినట్టుగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు.

గురువారం నాడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ తో బోధన్ ఎమ్మెల్యే షకీల్  భేటీ అయ్యారు.అరవింద్ కుమార్ తో షకీల్ భేటీ కావడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడారు. 

కేసీఆర్ దయతోనే ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన గుర్తు చేసుకొన్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు లేదని ఆయన అభిప్రాయపడ్డారు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో ఉండలేకపోతున్నానని ఆయన కుండబద్దలు కొట్టారు.రాజీనామా చేయడానికి కూడ తాను సిద్దంగా ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు.కేసీఆర్ ను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని హమీ ఇచ్చారని.. టీఆర్ఎస్ లో తాను ఏకైక ముస్లిం ఎమ్మెల్యేగా ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ నేతలు ఎంఐఎం నేతలు చెప్పినట్టుగా వింటున్నారని ఆయన  ఆరోపించారు. 

సోమవారంనాడు పలు విషయాలపై పూర్తిగా  స్పందిస్తానని ఆయన ప్రకటించారు. అరవింద్ తో ఏ విషయాల గురించి చర్చించారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారనే విషయమై షకీల్ తో అరవింద్ ఆరా తీశారనే ప్రచారం సాగుతుంది.మంత్రి పదవి దక్కని కారణంగా ఇప్పటికే అసంతృప్తితో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యలు బహిరంగంగానే ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే నష్ట నివారణ చర్యలకు టీఆర్ఎస్ నాయకత్వం దిగింది. 

జోగు రామన్న, రాజయ్య,  నాయిని నర్సింహ్మారెడ్డిలతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చించింది. బుధవారం నాడు అసంతృప్త నేతలు టీఆర్ఎస్ భవనంలో కేటీఆర్ తో సమావేశమయ్యారు.అసంతృప్తి వాదులను బుజ్జగిస్తున్న తరుణంలోనే షకీల్ బీజేపీ ఎంపీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

బిజెపి ఎంపీ ఆరవింద్ తో టీఆర్ఎస్ ఎమ్మల్యే షకీల్ భేటీ: గులాబీ పార్టీలో కలకలం

టీఆర్ఎస్ లో అసమ్మతి: బిజెపి భయంతో రంగంలోకి కేటీఆర్

పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ