MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Axar Patel : అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్‌లు.. బాపు నువ్వు తోపు !

Axar Patel : అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్‌లు.. బాపు నువ్వు తోపు !

India vs England : టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 7 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌లు, భారత ప్లేయర్ల మెరుపు ఫీల్డింగ్ ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 05 2026, 11:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అక్షర్ పటేలా? లేక గాల్లో ఎగిరే పక్షా? కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఇంగ్లాండ్‌ను పాతరేసిన బాపు
Image Credit : X@bcci

అక్షర్ పటేలా? లేక గాల్లో ఎగిరే పక్షా? కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఇంగ్లాండ్‌ను పాతరేసిన బాపు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను ప్రదర్శించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అక్షర్ పటేల్ మెరుపు క్యాచ్‌లు.. ఇవే మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్
Image Credit : X@bcci

అక్షర్ పటేల్ మెరుపు క్యాచ్‌లు.. ఇవే మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్

ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ప్రమాదకరమైన ఫిల్ సాల్ట్ (5) ఇచ్చిన క్యాచ్‌ను కవర్ పాయింట్ వద్ద అక్షర్ వెనక్కి పరిగెత్తుతూ అత్యంత చాకచక్యంగా అందుకున్నాడు. దాదాపు 24 మీటర్లు పరుగెత్తి అద్భుతమైన క్యాచ్ ను పట్టాడు.

ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వేసిన ఐదో ఓవర్లో హ్యారీ బ్రూక్ (7) ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను డైవ్ చేస్తూ పట్టుకున్న తీరు స్టేడియంను హోరెత్తించింది. ఈ క్యాచ్‌లతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కోలుకోలేని దెబ్బతింది.

We're witnessing an Axar Patel masterclass in the field! 🫡

Another 𝗯𝗹𝗶𝗻𝗱𝗲𝗿 𝗼𝗳 𝗮 𝗴𝗿𝗮𝗯 to break the partnership 👏

Wicket No. 5️⃣

Updates ▶️ https://t.co/LxSBs3EDPx#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/OjR805VIlk

— BCCI (@BCCI) March 5, 2026

36
జ్యాక్స్ వికెట్.. అక్షర్, దూబే మాయ చేశారు !
Image Credit : X@BCCI

జ్యాక్స్ వికెట్.. అక్షర్, దూబే మాయ చేశారు !

కేవలం నేరుగా క్యాచ్‌లు పట్టడమే కాకుండా, బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ చూపిన సమయస్ఫూర్తి అద్భుతం. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో విల్ జ్యాక్స్ (35) కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద అక్షర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో బంతిని తెలివిగా లోపలికి విసరగా, అక్కడే ఉన్న శివం దూబే దానిని అందుకుని విల్ జ్యాక్స్‌ను పెవిలియన్ పంపాడు. ఈ వికెట్ ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లింది.

46
భారత భారీ స్కోరు.. శాంసన్, దూబే వీరవిహారం
Image Credit : X/BCCI

భారత భారీ స్కోరు.. శాంసన్, దూబే వీరవిహారం

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (9) త్వరగా పెవిలియన్ చేరాడు. అయితే, సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులతో (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (39), శివం దూబే (43) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది.

56
ఇంగ్లాండ్ పోరాటం.. బెథెల్ మెరుపు సెంచరీ
Image Credit : Getty

ఇంగ్లాండ్ పోరాటం.. బెథెల్ మెరుపు సెంచరీ

254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా యంగ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ వీరోచిత పోరాటం చేశాడు. కేవలం 45 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 పరుగులు చేసి భారత్‌ను వణికించాడు. అయితే చివరి ఓవర్లో 30 పరుగులు అవసరమైన దశలో శివం దూబే బౌలింగ్‌లో బెథెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ మూడు సిక్సర్లు బాదినా, ఇంగ్లాండ్ 246 పరుగుల వద్దే నిలిచిపోయింది.

66
బౌలింగ్ లో హార్దిక్, బుమ్రా కీలక పాత్ర
Image Credit : AFP

బౌలింగ్ లో హార్దిక్, బుమ్రా కీలక పాత్ర

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్ రన్ రేట్‌ను నియంత్రించాడు. వరుణ్ చక్రవర్తి 64 పరుగులిచ్చి ఒక వికెట్ తీసినప్పటికీ, కీలక సమయంలో బట్లర్‌ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఫీల్డింగ్‌లో అక్షర్ పటేల్ చేసిన మ్యాజిక్, బౌలర్లకు కొండంత అండగా నిలిచి భారత్‌ను ఫైనల్ చేర్చింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
IND vs ENG : ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. ఫైనల్‌కు భారత్! వాంఖడేలో టీమిండియా జైత్రయాత్ర
Recommended image2
IND vs ENG : టీ20 వరల్డ్ కప్ హిస్టరీనే తిరగరాసిన భారత్ ! ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved