Asianet News TeluguAsianet News Telugu

డీఆర్‌ఎస్ తీసుకోమన్నందుకు కుల్దీప్ యాదవ్‌ని బూతులు తిట్టిన రోహిత్ శర్మ... కెప్టెన్ చేసిన పనికి...

India vs Australia: డీఆర్‌ఎస్ తీసుకునేందుకు కెప్టెన్ రోహిత్ శర్మను ఒప్పించిన కుల్దీప్ యాదవ్... టీవీ రిప్లైలో నాటౌట్‌గా తేలడంతో కుల్దీప్‌పై ఫైర్ అయిన టీమిండియా కెప్టెన్.. 

India vs Australia: Rohit Sharma reaction gets attention after kuldeep yadav forces to take DRS cra
Author
First Published Mar 22, 2023, 8:10 PM IST

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ల పాటు రిజర్వు బెంచ్‌లో కూర్చున్న కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా మారాడు. ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2023 వరకూ వన్డేల్లో 27 వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ యాదవ్... బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 8 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 40 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన తర్వాత కూడా రెండో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు కుల్దీప్ యాదవ్...

తాజాగా చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలో 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 3 వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్. ఆస్ట్రేలియా టాపార్డర్‌ని హార్ధిక్ పాండ్యా అవుట్ చేస్తే, మిడిల్ ఆర్డర్‌ని కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. 23 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని, 28 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్, అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు..

అయితే చెన్నై వన్డేలో కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ కంటే ఎక్కువగా వింత ప్రవర్తనతోనే ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం అప్పీలు చేశాడు కుల్దీప్ యాదవ్. యాదవ్‌తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అవుట్ కోసం అప్పీలు చేశారు...

కెఎల్ రాహుల్ వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో ఇన్నింగ్స్ మధ్యలో సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో వికెట్ కీపింగ్ చేయించింది టీమిండయా.

కెప్టెన్, వికెట్ కీపర్ డీఆర్‌ఎస్ తీసుకోవాలా? వద్దా? అని ఆలోచించారు. బౌలర్ కుల్దీప్ యాదవ్‌ అభిప్రాయం అడుగుదామంటే అతను అప్పటికే చాలా దూరం వెళ్లిపోయాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో కుల్దీప్ యాదవ్ సైలెంట్‌గా తర్వాతి డెలివరీ బౌలింగ్ చేయడానికి వెనక్కి వెళ్లిపోయాడు...

దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ షాక్ అయ్యారు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగానే నాటౌట్ అని డిసైడ్ అయిపోయి, వెళ్లిపోయిన కుల్దీప్ యాదవ్, అంతలా అప్పీలు చేయడం ఎందుకు? అని ఆశ్చర్యపోయారు...

46 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు కుల్దీప్ యాదవ్. అయితే కథ అక్కడితో అయిపోలేదు. ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో అప్పుడే క్రీజులోకి వచ్చిన ఆసీస్ బౌలర్ అస్టన్ అగర్ వికెట్ కోసం డీఆర్‌ఎస్ తీసుకోవాల్సిందిగా కోరాడు కుల్దీప్ యాదవ్...

అయితే అది నాటౌట్‌గా టీవీలో క్లియర్‌గా కనిపించడంతో డీఆర్‌ఎస్ తీసుకోవాల్సిందిగా కోరిన కుల్దీప్ యాదవ్‌ని బూతులు తిట్టాడు రోహిత్ శర్మ. ఇవన్నీ టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. కుల్దీప్ యాదవ్‌తో ఉన్న చనువుతో రోహిత్ శర్మ అలా మాట్లాడినా టీమిండియా కెప్టెన్ నుంచి ఇలాంటి మాటలు రావడంతో అభిమానులు అవాక్కు అవుతున్నారు...

Follow Us:
Download App:
  • android
  • ios