CSK vs LSG : సిక్స‌ర్ల మోత‌.. సెంచ‌రీతో చెల‌రేగిన రుతురాజ్.. శివాలెత్తిన శివమ్ దూబే..

CSK vs LSG - IPL 2024: ఐపీఎల్ 2024లో ప‌రుగుల వ‌ర‌ద పారుతోంది. హాఫ్ సెంచ‌రీలు, సెంచ‌రీల మోత మోగుతోంది. ఈ సీజన్‌లో ఐదో సెంచరీ చెపాక్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సాధించాడు. శివమ్ దూబే శివాలెత్తుతూ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. 
 

CSK vs LSG - IPL 2024: dose of sixes, Ruturaj incredible century, Another half-century by Shivam Dube RMA

CSK vs LSG: CSK vs LSG : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో ప‌రుగుల వ‌ర‌ద పారుతోంది. దుమ్మురేపే బ్యాటింగ్ తో బ్యాట‌ర్స్ అద‌ర‌గొడుతున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా  39వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 210 ప‌రుగుల భారీ  స్కోర్ ను సాధించింది. ఐపీఎల్ 2024లో సెంచరీల వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో ఐదో సెంచరీ చెపాక్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్ నుండి వచ్చింది.

ఈ మ్యాచ్ లో చెన్నైకి ఆరంభం అంత మంచిగా లేదు కానీ, ఆ తర్వాత బ్యాటింగ్ లో దుమ్మురేపింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ తో లక్నో బౌలింగ్ ను ఉతికిపారేశాడు. అలాగే, శివ‌మ్ దూబే మ‌రోసారి త‌న దండ‌యాత్ర‌ను కొన‌సాగించాడు. చెన్నై నుంచి సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా గైక్వాడ్ నిలిచాడు. గైక్వాడ్ ఐపీఎల్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. అంత‌కుముందు, ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్‌పై తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు.

 

 

రుతురాజ్ విజృంభ‌ణ‌.. 

ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నైకి చాలా చెడ్డ ఆరంభం లభించింది, బ్యాటింగ్ ప్రారంభించిన అజింక్య రహానె కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీని తర్వాత డారిల్ మిచెల్ కూడా 11 పరుగుల స్కోరు వద్ద వికెట్ కోల్పోయాడు. కానీ రితురాజ్ గైక్వాడ్ ఒక ఎండ్ నుంచి ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కేవలం 57 బంతుల్లోనే సెంచరీ సాధించి చివరి వరకు నిలదొక్కుకున్నాడు. గైక్వాడ్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులతో అజేయంగా నిలిచాడు.

 

 

శివమ్ దూబే సిక్స‌ర్ల మోత‌.. ఈ సీజ‌న్ లో మూడో ఫిఫ్టీ

రుతురాజ్ గైక్వాడ్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తుండ‌గా, మ‌రో ఎండ్ లో శివమ్‌ దూబే ల‌క్నో బౌలర్లపై దారుణంగా దండ‌యాత్ర‌ను కొన‌సాగించాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 భారీ సిక్స‌ర్ల‌తో  66 ప‌రుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శివ‌మ్ దూబే బ్యాటింగ్ స‌మ‌యంలో చెపాక్ హోరెత్తింది. దూబే, గైక్వాడ్ ఆట‌తో  చెన్నై జట్టు స్కోరు బోర్డులో 210 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో ఎంఎస్ ధోనీ  చివ‌రి బంతిని ఆడి ఫోర్ కొట్టి అభిమానులను అల‌రించాడు.

 

 

చెన్నై తరఫున ఐపీఎల్‌లో సెంచరీలు బాదిన బ్యాట‌ర్లు వీరే..

మురళీ విజయ్ - 2
షేన్ వాట్సన్ - 2
రుతురాజ్ గైక్వాడ్ - 2
మైకేల్ హస్సీ - 1
బ్రెండన్ మెకల్లమ్ - 1
సురేష్ రైనా - 1
అంబటి రాయుడు - 1

T20 WORLD CUP 2024 యాక్ష‌న్ కు మీరు సిద్ద‌మా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా సాంగ్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios