INDvsAUS:  టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్  ఒక్క ఫార్మాట్ కే  సరిపోతాడా..?  తాజాగా అతడి ప్రదర్శనలు చెబుతున్న కఠిన నిజమిదేనా..? 

9, 8, 4, 34, 6, 4, 31, 0, 14, 0, 0.. ఈ అంకెల మధ్య ఉన్న కామాలు తీసేస్తే ఎవరి ఫోన్ నెంబర్ వస్తుందో అనుకుంటున్నారా..? అస్సలు కాదు. టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ గడిచిన పదకొండు వన్డే ఇన్నింగ్స్ స్కోర్లు అవి. పొట్టి ఫార్మాట్ లో బరిలోకి దిగితే శివాలెత్తినట్టు ఊగిపోతూ క్రీజులో శివతాండవమాడే ఈ ‘మిస్టర్ 360’.. మిగతా ఫార్మాట్లలో మాత్రం అందులో పావు వంతు కూడా ఆడటం లేదనడానికి ఆ గణాంకాలే నిదర్శనం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీ20లలో ప్రపంచ స్థాయి బౌలర్లపైనా ఆధితప్యం చెలాయిస్తూ దుమ్మరేపుతున్న సూర్య.. వన్డేలలో మాత్రం ఆస్థాయి ఆట కనబరచడం లేదు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి, ఇతర గాయాలతో టీమ్ లోకి చోటు దక్కించుకుంటున్న సూర్య.. తాను ఒక్క ఫార్మాట్ కే పనికొస్తానని చెప్పకనే చెబుతున్నాడు. 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా వాంఖడే లో డకౌట్ అయిన సూర్య.. తాజాగా విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కూడా ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. రెండు సందర్భాల్లోనూ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే సూర్య వెనుదిరిగాడు. విశాఖ వన్డేలో సూర్య డకౌట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో టీమిండియా ఫ్యాన్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య అన్ని ఫార్మాట్లకు సరిపోయే ప్లేయర్ కాదని.. అతడిని వన్డేలలో ఆడించడం మానేసి ఆ స్థానంలో సంజూ శాంసన్ ను ఆడిస్తే చాలా బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Scroll to load tweet…

విశాఖ వన్డే తర్వాత సూర్యను ట్రోల్ చేస్తూ పలువురు పెట్టిన పోస్టులు, మీమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కొంతమంద ఆర్సీబీ, డివిలియర్స్ ఫ్యాన్స్ అయితే ఏదో ఒకట్రెండు టీ20 ఇన్నింగ్స్ లలో ఆడినంత మాత్రానా సూర్యను.. ఏబీడీతో పోల్చడం సరికాదని కౌంటర్ ఇస్తున్నారు. ఏబీడీ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని.. సూర్యకు అంత సీన్ లేదని వాపోతున్నారు. టీ20లలో సూర్యప్రతాపం ఉంటుందేమో గానీ మిగతా ఫార్మాట్లలో సూర్యాస్తమయమేనని చెప్పుకుంటున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

కాగా వరుసగా విఫలమవుతున్న సూర్యకు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కడం కష్టమేనని వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్న వేళ ఇకనైనా రాణించకుంటే సూర్య.. వన్ ఫార్మాట్ ప్లేయర్ గానే మిగిలిపోవడం ఖాయం...!