Asianet News TeluguAsianet News Telugu

కరోనా లాక్ డౌన్.. నడి రోడ్డుపై వలస కార్మికుడి దీనస్థితి.. ఫోటో వైరల్

స్వస్థలానికి వెళ్లడానికి వాహన సదుపాయం కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడపుతున్నాడు. ఇక చేసేందేమీ లేక కాలుకున్న సిమెంట్‌ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడకన స్వస్థలానికి బయలేదేరాడు. 
 

Migrant Worker, Whose Pic Went Viral, To Walk Home Despite Fracture
Author
Hyderabad, First Published Mar 31, 2020, 1:37 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ వైరస్ ని ఎదురుకోవడానికి దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే... ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. తమ సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు.

కాగా.. నడిరోడ్డుపై ఓ వలస కార్మికుడు పడుతున్న బాధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read కేరళలో కరోనాను జయించిన వృద్ద దంపతులు...

భన్వరాల్‌ అనే కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హుస్నాగాబాద్‌ ప్రాంతం నుంచి ఉపాధి కోసం రాజస్తాన్‌కు వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే పని ప్రదేశంలో ప్రమాదశాత్తు కాలు ఫ్యాక్చర్‌ కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఓవైపు ఉపాధిలేక, మరోవైపు ఇంటికి పంపేందుకు డబ్బులులేక అవస్థలు పడుతున్నాడు. 

స్వస్థలానికి వెళ్లడానికి వాహన సదుపాయం కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడపుతున్నాడు. ఇక చేసేందేమీ లేక కాలుకున్న సిమెంట్‌ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడకన స్వస్థలానికి బయలేదేరాడు. 

సుమారు 245 కిలోమీటర్లు నడక ద్వారా రాజస్తాన్‌లోని తన నివాసానికి వెళ్లాడానికి సిద్ధమయ్యాడు. రోడ్డుపై దీనిని చూసిన వారంతా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ ఫోటో చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే.. ఇంకా చాలా మంది వలస కార్మికులు మార్గ మధ్యలో ప్రాణాలే కోల్పోతున్నారని అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాల పాటు ఉన్నచోటే ఉంటే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న విషయాన్నివలస కార్మికులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్యలు ఎదురౌతున్నాయని అధికారులు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios