Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కోవిడ్ విజృంభణ.. ఒకే రోజు 2,151 కొత్త కేసులు.. ఐదు నెలల్లో అత్యధికం

కొంత కాలం వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ లో  ఒకే రోజు 2,151 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో ఇవే అత్యధికం.

 

Covid boom in India.. 2,151 new cases in a single day.. Highest in five months.. ISR
Author
First Published Mar 29, 2023, 2:46 PM IST

భారత్ లో మళ్లీ కోవిడ్ -19 విజృంభిస్తోంది. రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు నెలల్లో ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11 వేలు దాటాయి.

ఉచితంగానే యూపీఐ పేమెంట్స్.. ప్రతి నెలా 80 లక్షల లావాదేవీలు.. : ఎన్పీసీఐ

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. భారతదేశంలో ఒకే రోజు 2,151 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 11,903 కు పెరిగాయి. చివరి సారిగా గతేడాది అక్టోబర్ 28వ తేదీన దేశంలో 2,208 కేసులు వెలుగులోకి వచ్చాయి. 

నేటి ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన డేటా ప్రకారం.. కరోనా వల్ల మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, కేరళలో ముగ్గురు మరణించారు. దీంతో కోవిడ్-19 మరణాల సంఖ్య 5,30,848కి చేరింది. రోజువారీ పాజిటివిటీ 1.51 శాతంగా, వీక్లీ పాజిటివిటీ 1.53 శాతంగా నమోదైంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లలో ప్రస్తుత యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతంగా ఉన్నాయి. 

పార్లమెంట్‌లో కీలక పదవికి ఎన్నికైన విజయసాయిరెడ్డికి.. కాంగ్రెస్, బీజేపీ సహా ఐదు పార్టీల మద్ధతు

జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,66,925కి చేరగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా.. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్స్ అందించారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్వితే ఇక ఐదేళ్ల జైలు శిక్ష.. హెచ్చరికలు జారీ చేసిన రైల్వే శాఖ

రెండు వారాల్లో 3.5 రేట్లు పెరిగిన కరోనా కేసులు.. 
భారతదేశంలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం రెండు వారాల్లోనే కరోనా కేసులు 3.5 రేట్లు పెరిగాయి. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వీక్లీ టెస్ట్ పాజిటివిటీ రేటు (టీపీఆర్) 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాల సంఖ్య 32 కు పెరిగింది. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 63 జిల్లాల్లో మార్చి 19-25 తేదీల్లో టీపీఆర్ 5-10 శాతంగా ఉంది. కాగా.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, దానిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్ర‌స్తుత ప‌రిస్థితులను అంచనా వేసేందుకు ఇటీవల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios