Asianet News TeluguAsianet News Telugu

గూగుల్‌ పేరెంట్ కంపనీ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత

ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది సెర్చింజన్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్. గురువారం స్టాక్ మార్కెట్లలో అల్ఫాబెట్ షేర్ విలువ 0.76 శాతం పెరుగడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరుకున్నది. 
 

Alphabet becomes fourth US company to hit $1 trillionmark
Author
Hyderabad, First Published Jan 17, 2020, 12:11 PM IST

న్యూయార్క్‌: గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత సాధించింది. గురువారం కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయిని తాకిన నాలుగో అమెరికా టెక్‌ కంపెనీ ఇదే కావడం విశేషం. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్‌ షేరు ధర 0.76శాతం పెరగడంతో కంపెనీ విలువ లక్ష కోట్ల డాలర్లను చేరుకున్నది. 

also read స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ ఇప్పటికే ట్రిలియన్‌ డాలర్ల జాబితాలో ఉన్నాయి. 2018లో తొలిసారిగా ఆపిల్‌ ఈ ఘనత సాధించింది. గురువారం నాటికి ఈ కంపెనీ మార్కెట్‌ విలువ 1.38 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్‌ స్థాపించిన మైక్రోసాఫ్ట్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ 1.26 ట్రిలియన్‌ డాలర్లు. 

ఇక ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 2018 సెప్టెంబర్ నెలలో ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ కంపెనీ విలువ పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌ విలువ 930 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌, దాని అనుబంధ విభాగాలకు మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌. ఈ కంపెనీగా సీఈవోగా గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ను నియమిస్తూ గతేడాది కంపెనీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

also read  దేశంలో 56 శాతం దొంగ నోట్లు....అన్నీ 2000 వేల నోట్లే...

ఇక సౌదీ ఆరామ్‌కో రెండు ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను తాకింది. ఆ తర్వాత స్థానాల్లో యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, పెట్రోచైనా ఉన్నాయి. తాజాగా ఆల్ఫాబెట్‌ కూడా ఈ జాబితాలో చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios