Asianet News TeluguAsianet News Telugu

5 ఏళ్ల తర్వాత భారత విపణిలోకి హోండా సెడాన్ ‘సివిక్’

జపాన్ ఆటోమొబైల్ మేజర్ ఐదేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి సివిక్ అనే మోడల్ కారును మళ్లీ వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. సరికొత్త ఫీచర్లలో వినియోగదారులకు హోండా కార్స్ సందడి చేయనున్నది.

The new Honda Civic is expected to arrive along with the company's new entry-level car Amaze and the premium SUV CR-V.
Author
Hyderabad, First Published Feb 14, 2019, 10:38 AM IST

సరిగ్గా ఐదేళ్ల విరామం తర్వాత జపాన్‌ ఆటోమొబైల్ మేజర్ ‘హోండా కార్స్’వచ్చేనెలలో సెడాన్‌ మోడల్‌ కారు ‘సివిక్‌’ను భారత్‌లో మళ్లీ ప్రవేశ పెట్టనున్నది. వచ్చే నెలలో కొత్త సివిక్‌ను విపణిలో విడుదల చేసే అవకాశం ఉంది. 

ఇప్పటికే కంపెనీ సెడాన్‌ మోడళ్లు అమేజ్‌, సిటీ, అకార్డ్‌లను విక్రయిస్తోంది. కొత్త సివిక్‌తో మరింత ఎక్కువమంది వినియోగదారులకు చేరువ కావొచ్చని హోండా కార్స్ ఆశిస్తోంది. 
హోండా కార్స్ అనుబంధ సంస్థ హోండా కార్స్‌ ఇండియా ద్వారా భారత్‌లో విక్రయాలు సాగిస్తున్న హోండా.. ఎస్‌యూవీ సహా ఇతర విభాగాల్లో బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది. హోండా కార్స్ సివిక్ మోడల్ కారు సంస్థలో 10 తరం మోడల్ కావడం ఆసక్తికర పరిణామం.

కొత్త సివిక్‌తో పూర్తిస్థాయి సెడాన్‌ మోడళ్లను వినియోగదారులకు అందిస్తున్నామని హోండా కార్స్‌ అధ్యక్షుడు, సీఈఓ గకు నకనిషి పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో అందుబాటులోకి సివిక్ మోడల్ కారును వినియోగదారులకు తేనున్నట్లు తెలిపారు. 

పెట్రోల్‌ వెర్షన్‌లో 1.8 లీటర్‌ ఇంజిన్‌, డీజిల్‌ వెర్షన్‌లో 1.6 లీటర్‌ ఇంజిన్‌ అమర్చినట్లు హోండా కార్స్‌ అధ్యక్షుడు, సీఈఓ గకు నకనిషివివరించారు. పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్‌కు 16.5 కి.మీ, డీజిల్‌ వెర్షన్‌ లీటర్‌కు 26.8 కి.మీ మైలేజీ ఇస్తాయని అన్నారు. 

2006లో భారత్‌లో సివిక్‌ విక్రయాలు ప్రారంభించిన సంస్థ.. అప్పట్లో డిమాండ్ తక్కువగా ఉండటంతో 2013లో విక్రయాలు నిలిపివేసింది. దేశంలో దాదాపు 55,000 సివిక్‌లను విక్రయించింది. కంపెనీ ఇతర మోడళ్లపై సైతం దృష్టి పెట్టనుందని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ గోయల్‌ తెలిపారు.

మార్కెట్లో కొత్త మోడల్ సివిక్ కారు రూ.16 లక్షల నుంచి రూ.22 లక్షలు పలుకుతోంది. సివిక్ కారు.. అమేజ్, సీఆర్-వీ మోడల్ కార్లతో కలిసి విపణిలోకి ప్రవేశించనున్నది. ఆసక్తిగల కొనుగోలు దారులు రూ.51 వేలు చెల్లించి ప్రీ బుకింగ్ నమోదు చేసుకోవచ్చు.

టెన్త్ జనరేషన్ కారు ‘సివిక్’అన్ని ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ప్రామినెంట్ గ్రిల్ తోపాటు న్యూ స్పోర్టియర్ లుక్ కలిగి ఉంటుంది. మస్కులర్ బాయ్ నెట్, స్లోపింగ్ రూఫ్‌లైన్ ఫినిషింగ్‌తో హోండా కారు ‘సివిక్’ను డిజైన్ చేశారు. టెయిల్ ల్యాంప్స్ తోపాటు మొత్తం ఫీచర్లన్నీ రీవాంప్ చేసింది యాజమాన్యం. 

గతేడాది అమెరికా మార్కెట్లో విడుదల చేసిన సెడాన్ మోడల్ సివిక్ కారు వీల్స్ 18 అంగుళాలు ఉన్నా.. ఇండియన్ వేరియంట్ కారు వీల్స్ 18 అంగుళాల అల్లాయ్ తో తయారు చేస్తున్నారు. నూతన తరం సివిక్ మోడల్ కారు స్పేసియస్‌గా ఉంటుంది. 

పెట్రోల్ వర్షన్ హోండా ‘సివిక్ కారు’ ఇంజిన్ ఆప్షన్‌తోపాటు 6- స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్ బాక్స్ ఉంటుంది. డీజిల్ మార్చుకునేందుకు ట్రాన్స్ మిషన్ వెసులుబాటు కల్పించారు. ఈ కారు స్కోడా ఒక్లావియా, టయోటా కొరొల్లా ఆల్టిస్, హ్యుండాయ్ ఎలంట్రా మోడల్ కార్లతో తలపడనున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios