రీల్స్ చేస్తూ అద్దం పగలగొట్టిన యువతీ..! రిపేర్ చేసేందుకు ఎంత ఖర్చయిందంటే..

ఎక్కువ కామెంట్స్, లైక్స్  రావడానికి ఇంకా వీడియో  వైరల్‌ కావడానికి  చాలా మంది ఇలాంటి రీల్స్‌  ట్రై చేస్తుంటారు. ఇంకా విచిత్రమైన, ప్రమాదకర స్టంట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చాలా సార్లు ఈ రకమైన రిస్క్ స్టంట్ సమస్యల్లో పడేస్తుంది. 

teen girl insta dance reels on an expensive Lamborghini car,  brokes car  glass !-sak

ఇన్స్టగ్రామ్ రీల్స్  ఇప్పుడు చాల  ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలో స్టంట్స్‌ చేయబోయి రిస్క్‌లో పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓ యువతి రీల్స్ చేసేందుకు ఖరీదైన లాంబోర్గినీ కారుపై డ్యాన్స్ చేసింది. అయితే ఆమె చేసిన డ్యాన్స్ కారణంగా కారు అద్దాలు పగిలిపోయాయి.

ఎక్కువ కామెంట్స్, లైక్స్  రావడానికి ఇంకా వీడియో  వైరల్‌ కావడానికి  చాలా మంది ఇలాంటి రీల్స్‌  ట్రై చేస్తుంటారు. ఇంకా విచిత్రమైన, ప్రమాదకర స్టంట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చాలా సార్లు ఈ రకమైన రిస్క్ స్టంట్ సమస్యల్లో పడేస్తుంది. తాజాగా  టిక్‌టాక్ వీడియో కోసం ఓ యువతి ఖరీదైన లాంబోర్గినీ కారుపై డ్యాన్స్ చేసింది. దింతో  ఆమె కారు కారు ముందు అద్దం నుజ్జునుజ్జయింది. అంతేకాక కారు పైభాగం కూడా దెబ్బతింది. అలాగే ఈ వీడియో వైరల్‌గా మారింది.

రెడ్  టాప్, లైట్ బ్లు స్కర్ట్‌లో ఉన్న యువతి స్పెషల్ రీల్స్ చేయబోయి మరింత వైరల్ అయ్యేలా చేసింది. దింతో ఆ యువతి లక్ష్యం నెరవేరింది. అయితే ఆమె డ్యాన్స్  లేదా క్రియేటివిటీ  కారణంగా ఈ వీడియో వైరల్ కాలేదు. కానీ ఖరీదైన లంబోర్గిని కారు అద్దాలు పగలడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

బ్లు లంబోర్గినీ కారు ముందు నుంచి ఓ యువతి పరిగెత్తుకుంటూ నేరుగా కారుపైకి ఎక్కుతుంది. ఆమె ముందుగా బోనెట్ తరువాత  గ్లాస్ మీద కాలు పెట్టి   టాప్ మీదకి ఎక్కి  డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఆమె కారు విండ్‌షీల్డ్‌ను కాలుతో తొక్కడంతో లాంబోర్గినీ కారు అద్దాలు పగిలిపోయాయి. అయినా ఆమె పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తుంది. దీంతో కారు టాప్ పైభాగం కూడా దెబ్బతింది.

ఆ యువతి తన ప్లాన్ ప్రకారం డ్యాన్స్ చేసి వీడియోను కూడా పోస్ట్ చేసింది.  చివరకి ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనికి తోడు కామెంట్స్  కూడా  చేశారు. ఈ వీడియో ద్వారా ఆమె ఎంత సంపాదించిందో తెలియదు కానీ.. కారు గ్లాస్ రిపేర్ చేయడానికి అంతకు రెండింతలు డబ్బు ఇచ్చినట్లు ఆమె కామెంట్  చేసింది.

లంబోర్ఘిని కారు కాస్ట్లీ  అండ్  లగ్జరీ  కారు. భారతదేశంలో లాంబోర్ఘిని కారు ధర రూ. 3.22 కోట్లతో (ఎక్స్-షోరూమ్) మొదలై రూ. 8.89 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. దీని విడి భాగాలు కూడా చాలా ఖరీదైనవి. విండ్ షీల్డ్ మార్చాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.

వీడియో కోసం క్లిక్ చేయండి 

https://www.reddit.com/r/ImTheMainCharacter/comments/1bii5h7/mc_dances_on_top_of_car_and_breaks_the_windshield/?utm_source=share&utm_medium=mweb3x&utm_name=post_embed&utm_term=1&utm_content=1

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios