Automobile14, Feb 2019, 10:38 AM IST
5 ఏళ్ల తర్వాత భారత విపణిలోకి హోండా సెడాన్ ‘సివిక్’
జపాన్ ఆటోమొబైల్ మేజర్ ఐదేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి సివిక్ అనే మోడల్ కారును మళ్లీ వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. సరికొత్త ఫీచర్లలో వినియోగదారులకు హోండా కార్స్ సందడి చేయనున్నది.
cars13, Feb 2019, 4:08 PM IST
ప్రముఖ కంపనీల కార్లపై భారీ తగ్గింపు...రూ.15వేల నుండి రూ.2లక్షల వరకు
వివిధ భారతీయ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కనీసం రూ.15 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల సంస్థలు అదనంగా ఒక ఏడాది బీమా ఫీజు రాయితీ కూడా కల్పించాయి. అదనంగా డీలర్ల వద్ద మరికొన్ని రాయితీలు అందుబాటులో ఉంచాయి.. పదండి.. త్వర పడండి..
cars2, Feb 2019, 2:59 PM IST
జనవరిలో కార్ల సేల్స్ ఎలా వున్నాయంటే...
జనవరి నెల ఆటోమొబైల్ విక్రయాల్లో మిశ్రమ స్పందన నమోదైంది. కొన్ని సంస్థల కార్ల విక్రయాలు స్వల్పంగా మెరుగు పడగా, మరికొన్ని సంస్థల విక్రయాలు మందకోడిగా ఉన్నాయి.
cars26, Jan 2019, 8:41 AM IST
మారుతి సుజుకి డౌన్: పండగ సీజన్లోనూ తప్పని నిరాశ
విదేశీ మారక ధరలు, రూపాయి మారకం, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వడ్డీరేట్లు, బీమా వ్యయం తదితర అంశాలన్నీ సెంటిమెంట్ ను బలహీన పరిచాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం 17.21 శాతం తగ్గింది. ఇది వరుసగా రెండో త్రైమాసికంలో లాభం తగ్గడం ఒక ఎత్తైతే.. ఐదేళ్లలో ఇంత భారీగా నికర లాభం తగ్గడం ఇదే మొదటిసారి.
News26, Jan 2019, 8:27 AM IST
ఆఫర్లు, డిస్కౌంట్లతో లాభం లేదు... ఆటోమొబైల్ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: సియామ్
ఐదు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్న ఆటోమొబైల్ రంగం తమకు పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. వాణిజ్య వాహనాలపై దిగుమతి సుంకం పెంచి.. సాదారణ ప్రజలు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలు, కార్లపై తగ్గించాలని సియామ్ అభ్యర్థించింది. కాలుష్య నియంత్రణ వాహనాల తయారీకి రీసెర్చ్, డెవలప్మెంట్పై నిధులను కేటాయిస్తున్నందున మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని కోరుతోంది.
News24, Jan 2019, 1:39 PM IST
హీరో.. బజాజ్ బాటలో మారుతి.. జీఎస్టీ భారం తగ్గించాల్సిందే
ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న పన్నుల శ్లాబ్ తగ్గించాలన్న డిమాండ్ క్రమంగా ఊపందుకుంటున్నది. తొలుత హీరో మోటార్స్ అధినేత పవన్ ముంజాల్.. తదుపరి బజాజ్ ఆటోమొబైల్ చైర్మన్ రాహుల్ బజాజ్ లేవనెత్తారు.
cars23, Jan 2019, 11:07 AM IST
న్యూ మారుతి బాలెనో బుకింగ్స్ షురూ...కేవలం రూ.11,000 చెల్లిస్తే సరి
వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైన మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ బుకింగ్స్ మొదలయ్యాయి. కొనుగోలు చేయాలని భావించే వారు రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.
cars19, Jan 2019, 11:01 AM IST
టయోటా కిర్లోస్కర్ నుండి సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ కారు...
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ తాజాగా ‘న్యూ కామ్రీ’ మోడల్ కారును భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. టయోటా కిర్లోస్కర్ మేనేజింగ్ డైరెక్టర్ మజకజు యొషిమురా మాట్లాడుతూ భారత్ వంటి మార్కెట్లో పర్యావరణ అనుకూల వాహనాలకే భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.
Bikes19, Jan 2019, 10:49 AM IST
cars17, Jan 2019, 5:08 PM IST
ప్రముఖ కార్ల తయారీ కంపనీకి షాక్... 24 గంటల్లో రూ.100కోట్లు చెల్లించాలని ఆదేశం
ప్రముఖ కార్ల తయారీ కంపనీ వోక్స్ వ్యాగన్ కు జాతీయ హరిత ట్రిబ్యునల్ షాకిచ్చింది. పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా...తమ ఆదేశాలను భేఖాతరు చేసినందుకు గాను కంపనీపై ఎన్జీటి సీరియస్ అయ్యింది. కేవలం 24 గంటల్లోగా రూ.100 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమచేయాల్సిందిగా ఈ జర్మనీ కంపనీకి హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది.
Bikes16, Jan 2019, 11:37 AM IST
30ఏళ్ళ తర్వాత భారతీయ మార్కెట్లోకి...ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలు
వచ్చే ఏడాది ఢిల్లీలో నిర్వహించే ఆటో ఎక్స్ పోలో ఎంట్రీ ఇచ్చేందుకు లాంబ్రెట్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం మిలాన్ నగరంలో రూపుదిద్దుకుంటున్నది. 30 ఏళ్ల తర్వాత భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తోంది. ఇటీవల మార్కెట్లో ప్రవేశించిన అలనాటి ‘జావా’ మోటార్ బైక్ ప్రీ బుకింగ్స్‌తో యువతో పాత తరం బైక్‌లపై మోజు పెరిగిందని తెలుస్తోంది.
cars29, Dec 2018, 8:12 PM IST
భారీ ప్లాంట్ మూసివేతకు మారుతి సుజుకి నిర్ణయం...
ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం...మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిల్లీ సమీపంలోని గుర్‌గ్రావ్ లోని తమ సంస్ధకు చెందిన భారీ డీజిల్ ఇంజన్ తయారీ అసెంబుల్ యూనిట్ ను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్ లో మార్కెట్లో చోటుచేసుకునే పరిణామాలు, నూతన నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకి సంస్థ తెలిపింది.
Automobile3, Dec 2018, 2:57 PM IST
Bikes27, Nov 2018, 8:52 AM IST
Automobile23, Nov 2018, 5:40 PM IST