రాజమండ్రి: రాజమండ్రి ఎంపీ స్థానం నుండి బొడ్డు భాస్కరరామారావును బరిలోకి దింపనుంది టీడీపీ. ఈ స్థానం నుండి భాస్కరరామారావును బరిలోకి దింపేలా టీడీపీ నాయకత్వం ఒప్పించింది.

తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  పోటీకి బొడ్డు భాస్కరరామారావు పోటీ చేయాలని భావిస్తున్నారు.అయితే ఈ స్థానం నుండి  ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్పను  బరిలోకి దింపాలని టీడీపీ ప్లాన్ చేసింది.

దీంతో తనకు ఏ స్థానం కేటాయిస్తారో తేల్చాలని  బొడ్డు భాస్కరరామారావు హెచ్చరికలు చేశారు. ఈ విషయమై రాజమండ్రి నుండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని  బొడ్డు భాస్కర రామారావును టీడీపీ నాయకత్వం ఒప్పించినట్టు సమాచారం.

పెద్దాపురం నుండి  నిమ్మకాయల చినరాజప్ప బరిలోకి దిగనున్నారు.  అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయిన తర్వాత  తన నిర్ణయాన్ని  బొడ్డు భాస్కరరామారావు ప్రకటించే అవకాశం ఉంది.