అమరావతి: ఏపీలో ఎన్నికల ఫలితాలు షాక్ కు గురి చేశాయని అభిప్రాయపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. రెండోసారి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన సందర్భంగా ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

బెజవాడను తనను విడదీసి చూడలేరని అందుకే మళ్లీ గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు. బెజవాడ నగరం వేరే వాళ్లు హస్తగతం కాకుండా తాను రెండుసార్లు అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. హోదా విషయంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అని అన్నారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపై, ఐదేళ్ల పాలనపై విశ్లేషించుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు మా నుంచి ఇకా ఏదో ఆశించారని అది ఇవ్వలేకపోయి ఉంటామని అందుకే ఓటమి పాలయ్యామని కేశినేని నాని అభిప్రాయపడ్డారు.