హైదరాబాద్: తెలుగురాష్ట్రాలతోపాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై తొలిసారిగా జగన్ ఫ్యామిలీ స్పందించనుంది. ఈ ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో జగన్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో జగన్ ఎడమ చేతి భుజానికి గాయం అయ్యింది. తొమ్మిది కుట్లు కూడా పడ్డాయి. 

ఇప్పటి వరకు దాడికి సంబంధించి వైఎస్ జగన్ కానీ, తల్లి వైఎస్ విజయమ్మ,భార్య భారతీరెడ్డి, సోదరి షర్మిలలు ఎవరూ స్పందించలేదు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మాత్రం నేతలు స్పందించారు. అటు జగన్ పై దాడికి సంబంధించి తొలుత అధికార తెలుగుదేశం పార్టీ దాడిని ఖండించినప్పటికీ ఆ తర్వాత తీవ్ర విమర్శలు చేసింది. 

జగన్ పై దాడి అతని కుటుంబ సభ్యులే చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను తప్పించేందుకు వైఎస్ విజయమ్మ, లేదా షర్మిలలే దాడి చేయించి ఉంటారని వ్యక్తిగతంగా మాట్లాడారు. అంతేకాదు జగన్ ఫ్యామిలీలో అనేక గొడవలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపాయి. 

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీలు గట్టి కౌంటర్ ఇచ్చాయి. చంద్రబాబుపై అలిపిరి దాడి భువనేశ్వరి చేయించారు అంటే ఒప్పుకుంటారా అంటూ టీడీపీని వైసీపీ నిలదీసింది. వ్యాఖ్యలు చేసే ముందు కాస్త విజ్ఞతతో ఆలోచించాలంటూ హితవు పలికింది.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. తల్లి ఎక్కడైనా కొడుకును చంపుతుందా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పై దాడిని అంతా ఖండించాలని దాడి వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. 

అంతేకానీ తల్లి హత్య చేయించింది, చెల్లి హత్య చేయించింది అంటూ  వ్యాఖ్యలు చెయ్యడం సబబు కాదన్నారు. వైఎస్ విజయమ్మ, షర్మిలలు తనను తిట్టారని అయినా వారిని ఒక్కమాట కూడా అనలేదని చెప్పుకొచ్చారు. 

జగన్ పై కత్తితో దాడి కోడికత్తి డ్రామా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు ఘాటుగానే విమర్శించారు. కోడికత్తి డ్రామా అంటూ టైటిల్ పెట్టారు. లోకేష్ అయితే ట్విట్టర్ లో కోడికత్తి డ్రామా అంటూ హ్యాష్ టాగ్ కూడా ఇచ్చారు. 

జగన్ పై దాడికి సంబంధించి అధికార పార్టీ ఎంతటి ఘాటు వ్యాఖ్యలు చేసినా అటు వైఎస్ జగన్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ పెదవి విప్పలేదు. హెల్త్ బులెటిన్ పేరుతో వైద్యులు మాత్రమే చెప్పారు. 

జగన్ పై దాడి అనంతరం జరిగిన పరిణామాలు జగన్ ఈ 17 రోజులు  తీసుకున్న వైద్యం, అధికార పార్టీ నేతల విమర్శలపై స్పందించేందుకు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఆదివారం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ చర్చ్ లో వైఎస్ విజయమ్మ తన కుమారుడిపై దాడికి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే అది పెద్దగా వెలుగులోకి రాలేదు. 

ఇకపోతే దాడి అనంతరం వైఎస్ జగన్  పాదయాత్రను ఈనెల 12 నుంచి ప్రారంభించనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా చేరుకోనున్నారు. గత నెల 25న దాడికి ముందు ఎక్కడైతే నిలిపివేశారో అక్కడ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 

విజయనగరం జిల్లా సాలూరు మండలం మక్కువ నుంచి జగన్ తన పాదయాత్రను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. అయితే దాడి ఘటనపై జగన్ సైతం పాదయాత్రలో మాట్లాడే అవకాశం ఉంది. ఈనెల 15న దాడి ఘటనకు సంబంధించి జగన్ మాట్లనున్నట్లు సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే