MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే

School Holidays : ఈ వీకెండ్ తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఉగాది, రంజాన్ పండగల సెలవులు ఆదివారంతో కలిసి వస్తున్నాయి. దీంతో వరుసగా నాల్రోజులు హాలిడేసే. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 16 2026, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్..
Image Credit : Getty

తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్..

Holidays : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ కొనసాగుతోంది... ఇప్పటికే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముగిశాయి, పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక ఇతర క్లాసుల విద్యార్థులకు కూడా త్వరలోనే వార్షిక పరీక్షలు జరగనున్నాయి... దీంతో ప్రతి విద్యార్థిపై చదువుల ఒత్తిడి పెరిగింది. ఇలాంటి సమయంలో వరుస సెలవులు వస్తే..? విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది... చదువు నుండి కాస్త దృష్టిమరల్చి రిలాక్స్ కావడానికి సమయం దొరుకుతుంది. ఇలా ఈవారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఉగాది సెలవు...
Image Credit : Getty

ఉగాది సెలవు...

తెలుగు సంవత్సరాది ఉగాదిని ఇరు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. దేవాలయాల్లో నూతన పంచాంగ శ్రవణం ఉంటుంది… ప్రజలు కూడా ఇళ్లలో భక్తిశ్రద్దలతో పూజలు చేసుకుంటారు. తీపి, చేదు, పులుపు ఇలా అన్నిరకాల రుచులతో కూడిన ఉగాది పచ్చడి చాలా ప్రత్యేకం. ఈ పండగ నేపథ్యంలో మార్చి 19 అంటే వచ్చే గురువారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉంది.

36
 రంజాన్ సెలవు..
Image Credit : unsplash

రంజాన్ సెలవు..

ముస్లింలు గత నెలరోజులుగా ఉపవాస దీక్ష చేపడుతూ రంజాన్ పండగ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ పండగ రానే వచ్చింది... మార్చి 20 లేదా 21 తేదీన అంటే ఈ శుక్రవారం లేదా శనివారం రంజాన్ జరగనుంది. ఈ పండక్కి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.

రంజాన్ పండగ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే పండగ ఈ శుక్రవారమా లేక శనివారమా అన్నది క్లారిటీ లేదు. ఏపీలో మార్చి 20న, తెలంగాణలో మార్చి 21న రంజాన్ సెలవుగా ప్రకటించారు. అయితే ఇస్లామిక్ పెద్దల ప్రకటన తర్వాత పండగ ఎప్పుడయితే విద్యాసంస్థలకు ఆరోజు సెలవు ఉంటుంది. ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు ఈ రెండ్రోజులు సెలవు ఉంటుంది.

46
మార్చి 22న సెలవే..
Image Credit : Getty

మార్చి 22న సెలవే..

మార్చి 22న ఎలాగూ ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ తర్వాతి రోజు కూడా అధికారిక సెలవుగా ప్రకటించింది... కానీ ఈ అవసరం లేకుండానే సెలవు వచ్చేస్తోంది. ఇలా గురువారం నుండి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులపాటు ఇటు తెలంగాణ, అటు ఏపీలోని విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నాయి. 

56
ఉద్యోగులకు ఓ రోజు ఎక్ట్రా సెలవు..
Image Credit : X

ఉద్యోగులకు ఓ రోజు ఎక్ట్రా సెలవు..

కేవలం తెలుగు విద్యార్థులకు కాదు ఉద్యోగులకు ఈవారం వరుస సెలవులు వస్తున్నాయి. ఉగాది, రంజాన్ కు ఉద్యోగులందరికీ సెలవులే... ఆదివారం ఎలాగూ సాధారణ సెలవే. ఆసక్తికరంగా రేపు (మార్చి 17, మంగళవారం) కూడా ఉద్యోగులకు ఓ సెలవు వస్తోంది. 

రంజాన్ మాసంలో ప్రతిరోజును ముస్లింలు పవిత్రంగా భావిస్తారు.. కొన్నిరోజులు మాత్రం చాలా ప్రత్యేకం. అలాంటిదే షబ్-ఇ-ఖదర్... ఇది ఈ మంగళవారం వస్తోంది. అందుకే ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.

66
మార్చిలో సెలవులే సెలవులు..
Image Credit : getty

మార్చిలో సెలవులే సెలవులు..

ఎగ్జామ్స్ నెల మార్చిలో భారీగా సెలవులున్నాయి. ఇప్పటికే హోలీ సెలవు వచ్చింది... ఇప్పుడు ఉగాది, రంజాన్ సెలవులు రాబోతున్నాయి. ఇక మార్చి 27న (శుక్రవారం) అంటే వచ్చేవారం శ్రీరామనవమి ఉంది... ఆరోజు కూడా అధికారిక సెలవే. మార్చి 31 (మంగళవారం) మహవీర్ జయంతి ఉంది...ఈ రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇలా పండగలు, రెండో శనివారం, ఆదివారాలు కలుపుకుంటే మార్చి నెలలో సగంరోజులు సెలవులే ఉన్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
పండుగలు
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Bank Holidays : అయ్యబాబోయ్.. ఈ నెలలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఓసారి ఈ లిస్ట్ చూసుకోండి
Recommended image2
తెలుగు కపుల్స్ కి బంపరాఫర్... మూడో బిడ్డను కంటే డబ్బులకు డబ్బులు, సెలవులకు సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved