వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఇవాళ కోర్టుకు రాలేనని న్యాయస్థానానికి తెలిపనున్నారు. అక్రమాస్తుల కేసుతో పాటు మరికొన్ని కేసులపై నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతున్నారు.

పాదయాత్ర సమయంలోనూ వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపును ఇవ్వాలని జగన్.. న్యాయస్థానాన్ని కోరారు. సుధీర్ఘకాలానికి అనుమతి ఇవ్వడం కుదరదని కోర్టు పిటిషన్‌ను కొట్టిపారేసింది. దీంతో పాదయాత్రలో ఎక్కడ ఉన్నా ప్రతి శుక్రవారం హైదరాబాద్ చేరుకుంటున్నారు.

కోర్టుకు హాజరయ్యేందుకు నిన్న విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరుతుండగా.. విమానాశ్రయంలో జగన్‌పై ఓ యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన భుజానికి గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

డిశ్చార్జిపై వైద్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడంతో జగన్ ఇవాళ వ్యక్తిగతంగా హాజరుకాలేనని న్యాయస్థానానికి తెలపనున్నారు. ఈ మేరకు లాయర్‌తో మెమో దాఖలు చేయనున్నారు. 

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

ఆ విషయం తేలాల్సిందే: జగన్ మీద దాడిపై మోహన్ బాబు

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

మెడ కోసే ప్రయత్నం చేశాడు: జగన్ మీద దాడిపై విజయసాయి

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

ఆపరేషన్ గరుడ నిజమైంది, జగన్ ది దిగజారుడు రాజకీయం:అచ్చెన్నాయుడు

జగన్ పై దాడి.. హీరో శివాజీ చెప్పినట్లే జరిగింది