అమరావతి: ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పై దాడికి పాల్పడింది వైఎస్ జగన్ కు వీరాభిమాని శ్రీనివాస్ అని తెలిపారు. 2014లో వైఎస్ జగన్ సీఎం కాలేదని మనోవేదనకు శ్రీనివాసరావు గురైనట్లు అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చెప్తున్నారని తెలిపారు. జగన్ పై దాడిని తాము ఖండిస్తుంటే వైసీపీ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

ఆపరేషన్ గరుడలో చెప్పింది చెప్పినట్లు జరగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఓ ప్రముఖ నేతపై దాడి జరుగుతుందని  సినీనటుడు శివాజీ చెప్పినట్లు అలాగే  జరిగిందన్నారు. కేంద్రం కుట్రలో భాగంగానే ఏపీని అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని ఆరోపించారు. 

జగన్ పై దాడి జరిగిన వెంటనే ఢిల్లీలో ఉన్న కేంద్రవిమానయాన శాఖ మంత్రి స్పందిస్తారు..ఢిల్లీలో ఉన్న గవర్నర్ నరసింహన్ స్పందిస్తారు..అని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ డీజీపీకి ఫోన్ చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. గవర్నర్ కు డీజీపీకి ఫోన్ చేసే అధికారం లేదని తెలిపారు. అవసరం అయితే సీఎస్ లేదా ప్రభుత్వానికి ఫోన్ చెయ్యాలని స్పష్టం చేశారు. 

ఇకపోతే ఈ ఘటనపై తెలంంగాణ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, బీజేపీ నేత జీవీఎల్ వీరంతా క్షణాల్లో స్పందించారని దీనంతటిని చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందని అర్థమవుతుందన్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగితే జగన్ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. 

కత్తికి విషం పూసినట్లు అనుమానం వస్తే విశాఖపట్నంలోని ఏదైనా ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తనపై దాడి జరిగింది అది కుట్రపూరితంగా అయి ఉంటే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదని నిలదీశారు.  

రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆరోపణలు చెయ్యడం ఎంతవరకు సబబు అని నిలదీశారు మంత్రి అచ్చెన్న. ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టే జగన్ మూడు వేలకుపైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగిందానికి మాకు సంబంధం ఏంటని నిలదీశారు.

దాడికి సంబంధించి వైసీపీ నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం, వైఎస్ జగన్, పవన్, కేసీఆర్ లు కుట్రలు చేసి ఏపీలో అస్థిరతకు ప్లాన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీబీఐలో అవినీతి భాగోతంపై డైరెక్టర్ మార్పుపై సీఎం చంద్రబాబు నాయుడు ఎండగట్టారని ఎండగట్టిన తెల్లవారు జామునే కేంద్రం ఐటీ బృందాన్ని బరిలోకి దించిందని ఆరోపించారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే దాడి జరుగుతుందని చెప్పారు.  

విశాఖపట్నంలో దాడి జరిగిన తర్వాత నాలుగు గంటలు జగన్ హ్యాపీగా ఉన్నారని అన్నారు. దాడి జరిగిన తర్వాత జగన్ హైదరాబాద్ వెళ్లడం తప్పని ప్రశ్నించారు. పై నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాతే జగన్ ఆస్పత్రికి వెళ్లారు. అంటే ఇదంతా జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దాడి ఘటనకు సంబంధించి చిత్తశుద్ధిగా విచారణ జరగుతోందని వాస్తవాలు బయటకు వస్తాయని ఎవరూ తప్పించుకోలేరని తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు