హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ తీరుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటించి శ్రీనివాస రావు జగన్ మెడ కోసే ప్రయత్నం చేశాడని ఆయన అన్నారు. 

గొంతుపై కాకుండా భుజానికి గాయమైందని ఆయన గురువారం మీడియా సమావేశంలో అన్నారు. నిందితుడు పనిచేస్తున్న క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ నాయకుడికి చెందిందని ఆయన అన్నారు. ఎయిర్ పోర్టులోపలికి కత్తి ఎలా వచ్చిందని ఆయన అడిగారు. 

సంఘటన ఎయిర్ పోర్టులో జరిగింది కాబట్టి పోలీసులకు సంబంధం లేదా అని ఆయన ప్రశ్నించారు. విచారణకు ముందే కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిందితుడు జగన్ అభిమాని అని, పబ్లిసిటీ కోసం దాడి చేశాడని డిజీపీ ఎలా చెబుతారని, డీజీపి కాపీ కొట్టి పాసయ్యారా అని ఆయన అడిగారు. 

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. విశాఖ విమానాశ్రయంలో గురువారంనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు