కడప: ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలో ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యాడు.  తాజాగా వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కూడ హత్యకు గురికావడం సంచలనం కల్గిస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999 ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి  వైఎస్ రాజారెడ్డి హత్యకు గురయ్యాడు. వైఎస్ రాజారెడ్డి కారులో వెళ్తున్న సమయంలో  ప్రత్యర్థులు బాంబులు వేసి ఆయనను హత్య చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేతల హస్తం ఉందని ఆనాడు కాంగ్రెస్ ఆరోపించింది. టీడీపీ నేతలు కొందరు ఈ కేసులో శిక్షను కూడ అనుభవించారు.

1998 మే 23వ తేదీన  కారులో వెళ్తున్న రాజారెడ్డిని ప్రత్యర్ధులు దారికాచి హత్య చేశారు.  ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కూడ ఎన్నికలకు నెల రోజుల ముందే హత్యకు గురికావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ వివేకానందరెడ్డిది తొలుత గుండెపోటుతో మరణించినట్టుగా భావించారు. కానీ,  శరీరంపై గాయాలు ఉండడంతో  అతడిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ ఆరోపణలు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్యపై క్లూస్‌ దొరికాయి: కడప ఎస్పీ

వైఎస్ వివేకాది హత్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్ సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం