డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్
మాజీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు డీజీపీ గౌతం సవాంగ్ కు ఫోన్ చేశారు. తన నివాసం పై డ్రోన్ కెమెరాలను ఉపయోగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమరావతి: తన నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి వీడియోలు, ఫోటోలు తీయడంపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో శుక్రవారం నాడు ఫోన్లో మాట్లాడారు.
శుక్రవారం నాడు ఉదయం అమరావతిలో చంద్రబాబునాయుడు నివసిస్తున్న ఇంటిపై డ్రోన్ కెమెరాతో కొందరు వ్యక్తులు కెమెరాలు, వీడియోలు తీశారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించడంపై సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడు డీజీపీ గౌతం సవాంగ్ తో ఫోన్లో మాట్లాడారు. హై సెక్యూరిటీ జోన్లో డ్రోన్ కెమెరాను ఎలా అనుమతిస్తారని చంద్రబాబునాయుడు డీజీపీని ప్రశ్నించారు.
తన భద్రతనే ప్రశ్నార్ధకం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. డ్రోన్లు వాడేందుకు ఎవరు అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు. డ్రోన్ల వెనుక కుట్ర ఏంటో తెలియాలని ఆయన కోరారు.
సంబంధిత వార్తలు
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు
డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే