డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీయడంపై ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది.
అమరావతి: వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాను వినియోగించినట్టుగా ఏపీ ఇరిగేషన్ శాఖ ప్రకటించింది.
చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ కెమెరా వినియోగించడంపై టీడీపీ శ్రేణులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీసిన వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు పట్టుకొన్నారు.
వరద పరిస్థితిని అంచనా వేసేందుకే డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్టుగా ఏపీ నీటిపారుదల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వరద పరిస్థితి ఎలా ఉంది నీటి విడుదలను ఎక్కువగా పెంచితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనా వేసేందుకు గాను డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్టుగా ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది.
ఈ డ్రోన్ కెమెరాను ప్రైవేట్ వ్యక్తులు ఉపయోగించారని టీడీపీ ఆరోపిస్తోంది.వైఎస్ఆర్‌సీపీ నేతల ఆదేశాల మేరకు కొందరు ఈ ఫోటోలు, వీడియోలను చిత్రీకరించారని టీడీపీ ఆరోపణలు చేసింది.
సంబంధిత వార్తలు
డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు
డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే