Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

చంద్రబాబు నివాసం వద్ద ఆందోలనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు శుక్రవారం నాడు లాఠీ చార్జీ చేశారు. 

police lotty charge on tdp workers at chandrababu residence
Author
Amaravathi, First Published Aug 16, 2019, 1:41 PM IST

అమరావతి: చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై శుక్రవారం నాడు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు తరిమికొట్టారు.

శుక్రవారం నాడు ఉదయం చంద్రబాబు నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ ఇద్దరిని టీడీపీ కార్యకర్తలు పట్టుకొన్నారు.

వరద  పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్టుగా నీటి పారుదల శాఖాధికారులు ప్రకటించారు. అయితే డ్రోన్ కెమెరాను ఉపయోగించిన ఇద్దరు వ్యక్తులను తమ మధ్యే విచారణ చేయాలని టీడీపీ కార్యకర్తలు పట్టబట్టారు.  

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడ చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొన్నారు.పోలీసులను  అడ్డుకొన్నారు. దీంతో చంద్రబాబు నివాసం సమీపంలో ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జీకి  దిగారు.లాఠీచార్జీ చేసి ఆ:దోళన చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు తరిమికొట్టారు. మరికొందరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

Follow Us:
Download App:
  • android
  • ios