చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు
కృష్ణా నది కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వరద ఉతిని రెవెన్యూ అధికారులతో కలిసి అంచనా వేశారు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాస భవనం మెట్ల దాకా వరద నీరు చేరింది.
అమరావతి: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నివాసానికి ముప్పు ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీపై ఆంక్షలు విధించారు. బ్యారేజీపై నుంచి ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.
కృష్ణా నది కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వరద ఉతిని రెవెన్యూ అధికారులతో కలిసి అంచనా వేశారు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాస భవనం మెట్ల దాకా వరద నీరు చేరింది.
చంద్రబాబు నివాసాన్ని వరద నీరు చుట్టుముడుతోంది. శుక్రవారం సాయంత్రానికి వరద ఉఢృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు నివాసంలోని సిబ్బందిని హెచ్చరించారు. వరద నీరు లోనికి రాకుండా భారీ యెత్తున ఇసుక బస్తాలను వెస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం 15 అడుగులకు పైగా ఉంది. దీంతో విజయవాడ నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతితో అమరావతి, క్రోసూరు, అచ్చంపేటల మధ్య రాకపోకలు స్తంభించాయి.
విజయవాడలోని బాలాజీనగర్, భూపేష్ గుప్తనగర్, రామలింగేశ్వర నగర్ నీట మునిగాయి. మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. వరద తాకిడి ప్రాంతాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు.
సంబంధిత వార్తలు
డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే