చంద్రబాబునాయుడు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. బాబు నివాసంలోకి వెళ్లేందుకు మంత్రులు ప్రయత్నించకుండా భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు.
హైదరాబాద్: చంద్రబాబు నివాసం వద్ద శుక్రవారం నాడు ఉదయం నుండి టెన్షన్ వాతావరణం నెలకొంది.చంద్రబాబు నివాసానికి వెళ్లిన మంత్రులను భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు. మంత్రుల రాకను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం ఆందోళనకు దిగారు.
ఎగువ నుండి భారీగా వరద వస్తుండడంతో చంద్రబాబునాయుడు నివాసం వద్ద వరద పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించేందుకుగాను మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ లు చంద్రబాబు నివాసం వద్దకు వచ్చారు.
చంద్రబాబు నివాసం వద్ద వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తాము వచ్చినట్టుగా మంత్రులు చెప్పారు. అయితే మంత్రులను భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు.
బాబు నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మంత్రులపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు నివాసంలోకి మంత్రులు వెళ్లేందుకు ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. మంత్రులు వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.చంద్రబాబు నివాసంలోకి వెళ్లకుండా మంత్రులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
మూడు రోజుల క్రితం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు వచ్చారు. చంద్రబాబు కుడి చేయికి నొప్పి కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సూచన మేరకు ఆయన హైద్రాబాద్ కు వచ్చారు.వరద వస్తున్న విషయం తెలుసుకొనే చంద్రబాబు హైద్రాబాద్ కు పారిపోయాడని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
సంబంధిత వార్తలు
అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే
డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు
వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్
చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ
డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై
డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు
డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
