డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
డ్రోన్ కమెరాతో చంద్రబాబునాయుడు నివాసంపై ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు.
అమరావతి: చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు చంద్రబాబు నివాసం సమీపంలో పోలీస్ వాహనాన్ని అడ్డగించి ధర్నాకు దిగారు.
శుక్రవారం నాడు ఉదయం పూట కొందరు వ్యక్తులు డ్రోన్ కెమెరాను ఉపయోగించి చంద్రబాబు నివాసం పై నుండి ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు అక్కడికి చేరుకొన్నారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నీటి పారుదల శాఖ అధికారులుగా చెప్పుకొనే కొందరు డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఈ వీడియోలు తీసినట్టుగా చెప్పారని పోలీసులు తెలిపారు.
వీడియో తీసిన వ్యక్తులు ఎవరని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టుగా టీడీపీ నేతలకు పోలీసులు తెలిపారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకొని టీడీపీ నేతలు బైఠాయించారు.
సంబంధిత వార్తలు
డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై
డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు
డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే
"