విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరే అంశం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈనెల 25న చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కేందుకు రాధా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాధా రాకను టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. అలాగే రాధాను కలుపుకుపోవాలని కూడా సూచించారు. 

ఇకపోతే బుధవారం టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్దన్‌ వంగవీటి రాధాకృష్ణను ఆయన కార్యాలయంలో కలిశారు. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పంపించిన సమాచారాన్ని రాధకు తెలియజేశారు. 

అలాగే రాధాకృష్ణ సైతం పలు సూచనలు చేసినట్లు టీడీ జనార్థన్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం రాధా పలు సూచనలు చేశారని వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాధాకృష్ణ పార్టీలో చేరే అంశంపై గురువారం మీడియా సమావేశంలో వెల్లడిస్తారని తెలిపారు. 

రాధాకృష్ణ ఎల్లుండి శుక్రవారం టీడీపీలో చేరే అవకాశం ఉందన్నారు. రాధా రాకతో పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీడీపీ నేతలు అంతా కలిసే పనిచేస్తారని స్పష్టం చేశారు. రాధాకృష్ణకు ఎమ్మెల్సీ ఇస్తారా లేక విజయవాడ సెంట్రల్ సీట్ ఇస్తారా అన్నది చంద్రబాబు నిర్ణయమన్నారు. 

పార్టీలో చేరే వ్యక్తులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసునన్నారు. ఇకపోతే రాధా ఈనెల 21న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం రాధాకృష్ణ మీడియా సమావేశంలో తాను ఏపార్టీలో చేరబోతున్నారనేది స్పష్టం చేయనున్నారు. అయితే రాధా టీడీపీలో చేరనున్నారని ఈనెల 25న టీడీపీలో చేరే అవకాశం ఉందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

ఈ వార్తలను కూడా చదవండి

వంగవీటి రాధాతో టీడీపి నేతల రహస్య మంతనాలు

వంగవీటి రాధ టీడీపీలో చేరడం వెనుక, సూత్రధారి ఈయనేనా..?

టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?

టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా