విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తూ వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ రాజీనామా లేఖలోని అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. లేఖ పూర్తి పాఠం కింద చదవండి. 

 అన్ని వర్గాల అభిమానుపాత్రుడు, సామాన్యుడి సంఘటితానికి స్పూర్తి అయిన నా తండ్రి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారు ప్రజా క్షేత్రంలో సామాన్య ప్రజల సంక్షేమం, పేద ప్రజల సంరక్షణ కోసం అసువులు అర్పించారు. పేద ప్రజల కోసం నిరంతర పోరాటమే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వారి ఆకాంక్ష.
 
ఎవరి దాయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదు నాది. పోరాటమే నా ఊపిరి. అణచివేత విధానానికి, దమనకాండకు వ్యతిరేకంగా సర్వ ప్రజాసంక్షేమం కోసం, న్యాయ సంరక్షణ కోసం, వర్గాలకు అతీతంగా ఉద్యమం కొనసాగిస్తాను.
 
ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే మీ పార్టీలో అందరికీ ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం నాకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను

సంబంధిత వార్తలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత