వైసీపీకి వంగవీటి రాధా ఆదివారం నాడు  రాజీనామా చేశారు. రాజీనామా లేఖను  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు పంపారు. ఇవాళ ఉదయం నుండి పలువురు పార్టీ నేతలు ఆయనను బుజ్జగించినా కూడ ఆయన వెనక్కు తగ్గలేదు

విజయవాడ సెంట్రల్ సీటు నుండి పోటీ చేయాలని  వంగవీటి రాధా ప్లాన్ చేసుకొన్నారు.  అయితే ఈ స్థానం నుండి మల్లాది విష్ణు పోటీ చేస్తే పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయని వైసీపీ భావిస్తోంది. ఈ తరుణంలో విశాఖ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని  వైసీపీ కోరింది.

జగన్‌కు  పంపిన లేఖలో  రాధా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణచివేత విధానాలకు తాను పోరాటం చేస్తానని రాధా ప్రకటించారు. పోరాటమే తన ఊపిరి అంటూ చెప్పారు.

ప్రజా సంక్షేమం, న్యాయం కోసం తాను పోరాటం చేస్తానని వంగవీటి రాధా ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి సాధించాలంటే  పార్టీలో నేతలపై ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి అంటూ జగన్‌ను ఉద్దేశించిన రాధా కీలకమైన వ్యాఖ్యలు చేశారు.  ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తాను పనిచేయబోనని వంగవీటి రాధా ప్రకటించారు.

2014 వరకు విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ కు  గౌతంరెడ్డి ఇంచార్జీగా ఉండేవాడు. అదే ఎన్నికల్లో గౌతం రెడ్డి విజయవాడ సెంట్రల్ సీటు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు. ఆ సమయంలో విజయవాడ వైసీపీ అధ్యక్షుడిగా వంగవీటి రాధా ఉండేవాడు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి వంగవీటి రాధా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2015 లో విజయవాడ సెంట్రల్  నియోజకవర్గ బాధ్యతలను వంగవీటి రాధాకు అప్పగిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకొంది. దీంతో వంగవీటి రాధా 2019లో పోటీ చేసుకొనేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. తాజాగా బూత్ కమిటీల నియామకం  కూడ ప్రారంభమైంది.

అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మల్లాది విష్ణు  వైసీపీలో గత ఏడాది చేరారు. తొలుత విష్ణుకు వైసీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. నగరంపై కంటే సెంట్రల్ సీటు కేంద్రంగానే  మల్లాది విష్ణు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సెంట్రల్ నియోజకవర్గంలో  మల్లాది విష్ణు  కో ఆర్డినేటర్లను నియమించడంపై వంగవీటి రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని రాధా వర్గీయుల్లో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే  పీకే టీమ్ నిర్వహించిన సర్వేలో మల్లాది విష్ణుకే అనుకూలంగా ఉందనే ప్రచారం కూడ సాగింది.దీంతో సెంట్రల్ సీటును విష్ణుకే కేటాయించాలని పార్టీ నాయకత్వం ఓ అభిప్రాయానికి వచ్చిందంటున్నారు. 

దీంతోనే సెంట్రల్ బాధ్యతలను విష్ణుకు అప్పగించారు. విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని రాధాను వైసీపీ నాయకత్వం కోరుతోంది. అయితే సెంట్రల్ సీటు నుండే  పోటీ చేసేందుకు రాధా ఆసక్తి చూపుతున్నారు. సెంట్రల్ సీటులో రాధా కంటే విష్ణు మెరుగైన అభ్యర్థి అని వైసీపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. ఈ తరుణంలో వైసీపీ నాయకత్వం తన మాటకు విలువ ఇవ్వకపోవడంతో రాధా వైసీపీకి గుడ్ బై చెప్పారని ఆయన అనుచరులు  చెబుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

 

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..