విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల చేరికలతో హడావిడి నెలకొంది. తాజాగా వంగవీటి రాధాకృష్ణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా కృష్ణ భవిష్యత్ కార్యచరణ ఇంకా ప్రకటించలేదు. 

అయితే వంగవీటి రాధా ఈనెల 25న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. దీంతో రాధా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలు రాధాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

టీడీపీ సీనియర్ నేతలు బచ్చుల అర్జునుడు, టీడీ జనార్థన్ లు వంగవీటి రాధాను కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. అనంతరం ఏకాంతరంగా ముగ్గురు నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తెలుగుదేశం పార్టీలోకి చేరే అంశం, ఎమ్మెల్సీ పదవి, పార్టీలో చేరే తేదీపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన రాధాకృష్ణకు ఆ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు దక్కే అవకాశం లేదు. 

ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన్ను తప్పించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఇప్పటికే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి చేరతారంటూ చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు రాధా పార్టీలోకి రాబోతున్నారని ఆయనతో సర్దుకుపోవాలని సూచించారు. 

 ఈ వార్తలు కూడా చదవండి

వంగవీటి రాధ టీడీపీలో చేరడం వెనుక, సూత్రధారి ఈయనేనా..?

టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?

టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ