విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడం ఆ పార్టీని ఓ కుదుపు కుదిపేసింది. కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేతలలో ఒకరు వంగవీటి రాధాకృష్ణ. 

అలాంటి బలమైన వ్యక్తి పార్టీని వీడటం, అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వైసీపీకి మింగుడుపడని విషయంగా చెప్పుకోవచ్చు. వంగవీటి రాధా రాజీనామా చెయ్యడంతోో ఆయన అనుచరులు కూడా ఆయన బాటే పట్టారు. 

రాధాకు మద్దతుగా పలువురు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయానికి పంపారు. విజయవాడ కార్పొరేషన్ కు చెందిన 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ చందన సురేష్‌, 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ చోడిశెట్టి సుజాత, 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ కావాటి దామోదర్‌, 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ మద్దాల శివశంకర్‌, 18వ డివిజన్‌ కార్పొరేటర్ పాల ఝాన్సీలక్ష్మిలు వైసీపీకి రాజీనామా చేశారు. 

రాధా వెంటే తాము ఉంటామని స్పష్టం చేశారు. ఇకపోతే విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన వంగవీటి రాధా ఆశలపై వైసీపీ అధిష్టానం నీళ్లు చల్లడంతో ఆయన ఆదివారం వైసీపీకి రాజీనామా చేశారు. 

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని రాధా ప్రకటించారు. ఇంతలోనే ఐదుగురు కార్పొరేటర్లు రాజీనామా చెయ్యడంతో కృష్ణ జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.  

ఈ వార్తలు కూడా చదవండి

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా