Asianet News TeluguAsianet News Telugu

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్తబ్ధుగా ఉన్న ఆయన ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. 

vangaveeti radha will resigns to ysrcp
Author
Vijayawada, First Published Jan 20, 2019, 2:41 PM IST

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్తబ్ధుగా ఉన్న ఆయన ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. 

రాధ రాజీనామా చేస్తారన్న విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది. దీంతో బొత్స సత్యనారాయణ వంగవీటి రాధ నివాసానికి వెళ్లారు. సుమారు గంట పాటు చర్చించారు. బొత్స సత్యనారాయణతో చర్చలు సఫలీకృతం కాకపోవడంతో రాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే వేరే పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాధ పోటీ చెయ్యాలని భావించారు. అయితే విజయవాడ సెంట్రల్ నుంచి కాకుండా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాధను ఆదేశించింది. 

ఆ తర్వాత రాధ ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సమన్వయ కర్తగా మల్లాది విష్ణును నియమించింది. విష్ణు నియామకంతో రాధ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని రాధ పట్టుదలతో ఉన్నారు. 

ఆనాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. అటు వంగవీటి రంగా 30వ వర్థంతి వేడుకల్లోనూ ఎక్కడా వైసీపీ జెండా కనబడనివ్వలేదు. 

ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ముగిసిన తర్వాత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ముగింపు సభకు సైతం రంగాకు ఆహ్వానం అందలేదు. దీంతో వైఎస్ జగన్ రాధను పార్టీకి దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. 

ఇకపోతే రాధను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని పార్టీ వీడొద్దు అంటూ వైసీపీకి చెందిన సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, పార్థసారధి, తాజాగా బొత్స సత్యనారాయణలు కోరారు. అయినప్పటికీ రాధ తన నిర్ణయం మార్చుకోలేదు. 

ఇక వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి వంగవీటి రాధకు ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

వంగవీటి రాధాను దూరం పెట్టిన జగన్

జగన్ కి షాక్... పార్టీ మారనున్న వంగవీటి రాధా..?

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..

 

Follow Us:
Download App:
  • android
  • ios