Asianet News TeluguAsianet News Telugu

చెప్పేదొకటి..జరుగుతున్నదొకటి

  • చంద్రబాబునాయుడు చెప్పేదానికి వాస్తవంగా జరుగుతున్నదానికి ఏమాత్ర సంబంధం ఉండదు.
  • వినేవాళ్ళకు, చూసేవాళ్ళకు తానేదో బ్రహ్మాండంగా చేసేస్తున్నట్లు పెద్ద బిల్డప్ ఇస్తుంటారు.
  •  వాస్తవంగా చంద్రబాబు చెబుతున్నదానికి విరుద్ధంగా జరుగుతుంటుంది.
No relevance between naidus dialogue and action

                                                            ఏం చెప్పారు...

చంద్రబాబునాయుడు చెప్పేదానికి వాస్తవంగా జరుగుతున్నదానికి ఏమాత్ర సంబంధం ఉండదు. వినేవాళ్ళకు, చూసేవాళ్ళకు తానేదో బ్రహ్మాండంగా చేసేస్తున్నట్లు పెద్ద బిల్డప్ ఇస్తుంటారు. కానీ వాస్తవంగా చంద్రబాబు చెబుతున్నదానికి విరుద్ధంగా జరుగుతుంటుంది. తాజాగా అంటే, రెండు రోజుల కలెక్టర్లు, ఎస్పీల సదస్స జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సదస్సులో చివరగా ఎస్సీలతో మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణా, చిట్ ఫండ్ మోసాలు, ర్యాగింగ్ నిరోధంపై దృష్టి పెట్టాలని, కఠినంగా శిక్షించాలని చాలా గట్టిగా చెప్పారు.

                                                           వాస్తవాలేంటి?                                                            

ఎవరైనా పొరబాటున చంద్రబాబు చెప్పింది నిజమే అనుకుంటే వాళ్ళంత బకరాలుండరు. ఎందుకంటే, ఇసుక అక్రమ రవాణానే తీసుకుందాం. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. ఎలాగంటే, జరిగే ప్రతీ అక్రమ రవాణా వెనుక ఉండేది అధికారపార్టీ నేతలే కాబట్టి. ప్రతీరోజు కొన్న వేల లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ఎవరిపైనా కేసులుండవు. శుక్రవారం కూడా నూజివీడు ఎంఆర్ఓ వనజాక్షి 8 టిప్పర్లను పట్టుకున్నారు.

No relevance between naidus dialogue and action

అదే విధంగా చిట్ ఫండ్ మొసాలు. ఈ మోసాల్లో కూడా అధికారపార్టీ నేతల హస్తమే ఎక్కువుంది. ఆమధ్య ‘‘కాల్ మనీ సెక్స్ రాకెట్’’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక, ర్యాగింగ్ అంటారా? దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే, చాలా కాలేజీల్లో  ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. విద్యార్ధులు బలవుతూనే ఉన్నారు. అయినా ఎవ్వరిపైనా చర్యలుండవు. ఎందుకంటే, మెజారిటీ కాలేజీల యాజమాన్యాలు అధికారపార్టీ నేతల మద్దతుతోనే నడుస్తున్నాయి కాబట్టి. అంతెందుకు నారాయణ కాలేజీలో గడచిన మూడున్నరేళ్ళుగా ఎంతమంది చనిపోయారు? ఎవ్వరిపైనైనా చర్యలున్నాయా? చంద్రబాబు హూంకరింపులన్నీ కేవలం మీడియాలో ప్రచారం కోసమే తప్ప ఇంకెందుకు పనికిరాదన్న విషయం అందరకీ తెలిసిందే.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios